ఫుల్ జోష్‌లో ప్రభాస్! | Sakshi
Sakshi News home page

ఫుల్ జోష్‌లో ప్రభాస్!

Published Thu, Jun 26 2014 12:30 AM

ఫుల్ జోష్‌లో  ప్రభాస్!

దాదాపు రెండు నెలలుగా ప్రభాస్ ఇంటిపట్టునే ఉన్నారు. ఏప్రిల్‌లో భుజానికి జరిగిన శస్త్ర చికిత్స కారణంగా ఆయన విశ్రాంతిలో ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్న సమయంలో... ‘నాకేం ఫర్వాలేదు కోలుకుంటున్నా’ అని ఫేస్‌బుక్ ద్వారా ఆయన పేర్కొనడం అభిమానులకు ఊరటనిచ్చింది. ఇక, ఇటీవల ‘రన్ రాజా రాజా’ ఆడియో వేడుకలోనూ, గోపీచంద్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభోత్సవంలోనూ ప్రభాస్ పాల్గొన్నారు.

ఆ వేడుకలకు సంబంధించిన ఫొటోల్లో ప్రభాస్ ఎనర్జిటిక్‌గా కనిపించడంతో, త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటారని చాలామంది ఊహించారు. ఆ ఊహ నిజమే. సోమవారం నుంచి ఆయన ఫుల్ జోష్‌గా ‘బాహుబలి’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ‘‘మా కెప్టెన్ (దర్శకుడు రాజమౌళి) వరుసగా షూటింగ్ ప్లాన్ చేశారు. నూతనోత్సాహంతో ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నా’’ అని ఫేస్‌బుక్ ద్వారా ప్రకటించారు ప్రభాస్.
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement