బాబాయ్‌ అనే పిలిచే వ్యక్తి ఇక లేరు: హీరో గోపీచంద్‌ | Sakshi
Sakshi News home page

ఆయన మరణం ఎంతగానో బాధించింది: గోపీచంద్‌

Published Mon, Oct 9 2017 6:28 PM

Hero Gopichand console cinema writer MVS Haranatha Rao death - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ సినీ రచయిత, నటుడు ఎంవీఎస్‌ హరనాథరావు మృతి పట్ల హీరో గోపీచంద్‌ సంతాపం తెలిపారు. ఆయన మరణం తనను ఎంతగానో బాధించిందన్నారు. ‘ఒక రచయితగా, డైలాగ్ రైటర్గా తెలుగు సినిమాకి ఎంవీఎస్‌ హరనాథరావు అందించిన విశేషమైన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. మా నాన్నగారికి మాత్రమే కాక నాకు కూడా హరనాథరావుతో మంచి సాన్నిహిత్యం ఉండేది. నేను ‘బాబాయ్’ అని పిలుచుకొనే వ్యక్తి నేడు మా మధ్య లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకొంటున్నాను.’ అని అన్నారు. కాగా హరనాథరావు గుండెపోటుతో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన ప్రముఖ దర్శకుడు, హీరో గోపీచంద్‌ తండ్రి టీ కృష్ణ ద్వారా తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. స్వయంకృషి, ప్రతిఘటన, సూత్రధారులు వంటి అవార్డులు గెలుపొందిన సినిమాలకు కథ, మాటలు హరినాథరావు అందించారు.


 

Advertisement
Advertisement