ఎండను కూడా లెక్క చేయను! | Sakshi
Sakshi News home page

ఎండను కూడా లెక్క చేయను!

Published Wed, Oct 15 2014 11:13 PM

ఎండను కూడా లెక్క చేయను!

 సినిమాలో నటించడంతో తమ బాధ్యత అయిపోయిందని, ప్రచార కార్యక్రమాలతో సంబంధం లేదని కొంతమంది తారలు భావిస్తారు. కొంతమంది మాత్రం తమంతట తాము ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుకొస్తారు. అలాంటివాళ్లలో ప్రియాంక చోప్రా ఒకరు. ఒక సినిమాకి ప్రేక్షకులకు దగ్గర చేసేది మంచి ప్రచారమే అని ప్రియాంక చెబుతూ -‘‘మీరెంత మంచి సినిమా అయినా తీయండి.. జనాల దగ్గరకు తీసుకెళ్లలేకపోతే మొత్తం వృథాయే. పబ్లిసిటీతో నాకు సంబంధం లేదని నేనెప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే, తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టినప్పట్నుంచి, సినిమాకి ప్రచారం కల్పించేవరకూ నా బాధ్యత ఉంటుందని భావిస్తాను. అందుకే, ఏసీ హాల్స్‌లో కూర్చుని కాకుండా అవసరమైతే ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా రోడ్డు మీదకొచ్చి ప్రచారం చేస్తా’’ అన్నారు. సినిమా చేశామా? పారితోషికం తీసుకున్నాయా? జంప్ అయిపోయామా? అనే తరహా తారలు ప్రచారం విషయంలో ప్రియాంకను ఆదర్శంగా తీసుకోవాల్సిందే.
 

Advertisement
Advertisement