Sakshi News home page

ఆస్తులమ్మేస్తున్న ఇలియానా

Published Thu, Dec 19 2013 1:59 AM

ఇలియానా

ముందుతరం ప్రఖ్యాత తారలు సావిత్రి, కాంచన వంటి వారు తన నటనా ప్రతిభతో సినీ ప్రేక్షకుల గుండెల్లో  చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే కీర్తి కిరీటాలతో ఓహో అంటూ వెలిగిన ఆ తారలు చివరి దశలో ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం విచారకరం. ఈ తరం భామలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారనే చెప్పాలి. ఆస్తులు కూడబెట్టడంలో వారికి వారే సాటి. త్రిష, అనుష్క, నమిత వంటి కథానాయికలు తమ సంపాదనను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టి మరింత ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. అరుుతే వీరికి భిన్నంగా ఆస్తులమ్ముకుంటున్న నటి ఎవరంటారా? ఇంకెవరు గ్లామర్ డాల్ ఇలియానానే. ఆమెకంత కష్టమేమొచ్చిపడిందంటారా? కష్టం కాదు ఇష్టపడే విక్రయిస్తోంది.

 దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా ముఖ్యంగా టాలీవుడ్‌లో నెంబర్‌వన్‌గా వెలుగొందిన నటి ఇలియానా. కోలీవుడ్‌లో తొలి చిత్రం కేడీ నిరాశపరచినా ఆ మధ్య నటించిన నన్భన్ చిత్రంతో హిట్ హీరోయిన్ అనిపించుకుంది. అప్పట్లోనే కోటికి పైగా పారితోషికం డిమాండ్ చేసింది. ఆ విధంగా దక్షిణాదిలో వెలిగిపోతునే బాలీవుడ్‌పై కన్నేసింది. బర్ఫీ చిత్రంతో బాలీవుడ్‌ను ఆకర్షించింది. ఆ చిత్రంలో ఈ బ్యూటీ నటనకు ప్రశంసలు లభించాయి. దీంతో అమ్మడు హిందీ చిత్రాలపైనే పూర్తిగా దృష్టి సారించింది. అక్కడ అవకాశాలు కూడా బాగుండటంలో ఇక దక్షిణాదికి గుడ్‌బై చెప్పేసింది. దీంతో ఇంతకుముందు ఇక్కడ కొనుగోలు చేసిన ఆస్తులను అమ్మేసి ముంబయిలో కొనుగోలుచేసే పనిలో పడిందట.

Advertisement

What’s your opinion

Advertisement