ఎన్టీఆర్ టెంపర్ షూటింగ్ వాయిదా | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ టెంపర్ షూటింగ్ వాయిదా

Published Tue, Dec 9 2014 12:35 PM

ఎన్టీఆర్ టెంపర్ షూటింగ్ వాయిదా

చెన్నై: సోదరుడు నందమూరి జానకిరామ్ అకస్మిక మరణం జూనియర్ ఎన్టీఆర్ను తీవ్రంగా కలచివేసింది. దీంతో ఆయన శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో జూ.ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న టెంపర్ చిత్ర షూటింగ్ను 10 రోజుల పాటు వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ వర్గాలు మంగళవారం చెన్నైలో వెల్లడించాయి.  ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో టెంపర్ చిత్రం తెరకెక్కుతుంది.

ఈ చిత్రంలో పవర్పుల్ పోలీసు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ఒదిగిపొయి నటిస్తున్నారు. కాజల్ హీరోయిన్గా నటిస్తుంది. బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహారిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, కోట శ్రీనివాసరావు, మధురిమా బెనర్జీలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 2015 సంక్రాంతికి టెంపర్ చిత్రం విడుదల చేయాలని ఆ చిత్ర యూనిట్ షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement