మరోసారి నాగ్ వర్సెస్ బాలయ్య | Sakshi
Sakshi News home page

మరోసారి నాగ్ వర్సెస్ బాలయ్య

Published Fri, Jun 17 2016 1:42 PM

మరోసారి నాగ్ వర్సెస్ బాలయ్య - Sakshi

ఈ ఏడాది సంక్రాంతి బరిలో భారీ పోటీ నెలకొంది. ముఖ్యంగా సీనియర్ హీరోలు చాలా కాలం తరువాత ఒకేసారి బరిలో దిగడంతో సీన్ రసవత్తరంగా మారింది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో మన్మథుడు నాగార్జున, డిక్టేటర్ సినిమాతో నందమూరి బాలకృష్ణలు సంక్రాంతి బరిలో నిలిచారు. ఈ రెండు సినిమాలకు హిట్ టాక్ వచ్చినా.. భారీ వసూళ్లతో నాగార్జున కాస్త పై చేయి సాధించాడు.

ఇక మరోసారి ఈ సీనియర్ హీరోలు సంక్రాంతి బరిలో పోటీకి రెడీ అవుతున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తన వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అదే సమయంలో నాగార్జున మరోసారి భక్తి రస చిత్రం నమో వెంకటేశాయలో నటించడానికి రెడీ అవుతున్నాడు. చారిత్రాత్మక చిత్రాలుగా తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలను సంక్రాంతికే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

అయితే బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న గౌతమీ పుత్రశాతకర్ణి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే భారీ యుద్ద సన్నివేశాలతో తెరకెక్కుతుంటే నాగార్జున సినిమా మాత్రం భక్తిరస చిత్రంగా క్లాస్ ఆడియన్స్ను టార్గెట్ చేస్తోంది. దీంతో ఒకేసారి రిలీజ్ అయినా పెద్దగా నష్టం ఉండకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. మరి అనుకున్నట్టుగా ఒకేసారి బరిలో దిగుతారో లేక.. ఎవరో ఒకరు సైడ్ అవుతారో చూడాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement