రేపే ఆర్జీవీ ఫస్ట్‌ బుల్లెట్‌ | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 24 2018 3:11 PM

NagRGV4 Title First Look and Release Date Announcement Tomorrow - Sakshi

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రస్తుతం నాగార్జున హీరోగా ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్‌ చిత్రీకరణ జరపుకుంటోంది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈసినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ డేట్‌ను చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 

రామ్‌ గోపాల్ వర్మ సొంత నిర్మాణ సంస్థ కంపెనీ ప్రొడక్షన్‌ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌, టైటిల్‌తో పాటు రిలీజ్‌ డేట్‌ను రేపు (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటలకు ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. నాగార్జున పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మైరా సరీన్‌ కీలక పాత్రలో నటిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement