లవ్‌లో పడే వరకూ..

20 Jan, 2017 23:29 IST|Sakshi
లవ్‌లో పడే వరకూ..

బాబుగాడు ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ‘ఇప్పుడే చూసి అప్పుడే లవ్‌ ఏంట్రా?’ అని అమ్మాయి లైట్‌ తీసుకుంటుంది. కానీ, ఆ అమ్మాయి.. తనతో లవ్‌లో పడే వరకూ డిస్ట్రబ్‌ చేస్తాడు. జండూ బామ్‌కి కూడా తలనొప్పి తెప్పించే టైపులో బాబుగాడు అలియాస్‌ రాంబాబు ఆ అమ్మాయిని ఏ రేంజ్‌లో డిస్ట్రబ్‌ చేశాడో తెలియాలంటే మా సినిమా చూడండి అంటున్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు.

నాని, కీర్తీ సురేశ్‌ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో శిరీష్‌ నిర్మించిన సినిమా ‘నేను లోకల్‌’. చిత్ర సమర్పకులు ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘ఫిబ్రవరి 3న చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు. ఈ చిత్రానికి కథ–స్క్రీన్‌ప్లే–మాటలు: ప్రసన్న కుమార్‌ బెజవాడ, రచన: సాయికృష్ణ, కెమేరా: నిజార్‌ షఫి, అసోసియేట్‌ నిర్మాత: బెక్కం వేణుగోపాల్, సహ నిర్మాత: హర్షిత్‌రెడ్డి.