పవన్ కల్యాణ్ కాటమరాయుడే! | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్ కాటమరాయుడే!

Published Thu, Sep 1 2016 6:52 PM

పవన్ కల్యాణ్ కాటమరాయుడే! - Sakshi

పవర్ స్టార్ పవన్ కల్యాణ్  ప్రస్తుతం దర్శకుడు పవన్ డాలి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 'సర్దార్ గబ్బర్ సింగ్' చేదు అనుభవం మిగల్చడంతో.. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై అభిమానులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో నడిచే కథ అవ్వడంతో మరింత ఆసక్తి పెరిగింది. అయితే ఈ సినిమాకు 'కాటమరాయుడు' అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు వార్తలొచ్చాయి.

ఇప్పుడు అదే విషయాన్ని ధృవీకరిస్తూ చిత్ర నిర్మాత శరత్ మరార్ ట్వీట్ చేశారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన తాజా సినిమా టైటిల్ను ప్రకటించారు. 'కాటమరాయుడు' అనే టైటిల్ను కన్ఫామ్ చేశారు. అలాగే అభిమానులకు పవర్ స్టార్ బర్త్ డే కానుకగా గురువారం అర్థరాత్రి టైటిల్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. శుక్రవారం పవన్ పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ పండుగ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

Advertisement
Advertisement