అల్లుడి కోరిక మామ తీరుస్తారా? | Sakshi
Sakshi News home page

అల్లుడి కోరిక మామ తీరుస్తారా?

Published Sun, May 14 2017 8:32 AM

అల్లుడి కోరిక మామ తీరుస్తారా? - Sakshi

మామ, అల్లుడైన రజనీకాంత్, ధనుష్‌ల మధ్య చక్కని అనుబంధం ఉంది. రజనీకాంత్‌ అంటే ధనుష్‌క ఎనలేని అభిమానం. ధనుష్‌ అంటే రజనీకాంత్‌కు చాలా ఇష్టం. తాజాగా అల్లుడు నిర్మాతగా మామ చిత్రం చేయడానికి రెడీ అయ్యారు. ఇది అరుదైన విషయమే అవుతుంది. ఇదలా ఉంచితే ధనుష్‌ తొలి సారిగా దర్శకత్వం వహించిన పా.పాండి చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ఇంత పెద్ద విజయం సాధిస్తుందని బహుశా ధనుష్‌ కూడా ఊహించి ఉండరు.

పా.పాండి చిత్రాన్ని చూసిన రజనీకాంత్‌ మరో పదేళ్ల వరకూ ధనుష్‌ దర్శకత్వం జోలికి వెళ్లకూడదు అని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఏమిటీ ఆశ్చర్యపోతున్నారా? ఆయన స్టేట్‌మెంట్‌లో పాజిటివ్‌ అర్థమే దాగి ఉంది. పదేళ్ల వరకూ ధనుష్‌ దర్శకత్వం వహించిన పా.పాండి గురించే చర్చించుకుంటారని రజనీ పేర్కొన్నారు. అయితే ధనుష్‌ కోరిక వేరు.అంత పెద్ద విజయం సాధించిన ఆయన పదేళ్ల వరకూ ఊరికే ఉంటారా? పా.పాండి చిత్రానికి సీక్వెల్‌ రూపొందించాలన్న కోరిక పుట్టిందట.

అంతే అందుకు సింగిల్‌ లైన్‌ కూడా రెడీ చేశారట. అయితే పా.పాండి చిత్రంలో రాజ్‌కిరణ్‌ నటించిన పాత్రను సీక్వెల్‌లో తన మామ రజనీకాంత్‌ నటిస్తే బాగుంటుందని భావిస్తున్నారట. అందుకు సూపర్‌స్టార్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే. ధనుష్‌కు మరో ఆలోచన కూడా కలిగింది. పా.పాండి చిత్రాన్ని హిందీలో తెరకెక్కించాలని భావించిన ఆయన అందులో ప్రధాన పాత్రకు బాలీవుడ్‌ బిగ్‌బీని ఎంపిక చేయాలని అనుకుంటున్నారట. అందుకు అమితాబ్‌బచ్చన్‌తో చర్చలు కూడా మొదలెట్టినట్లు సమాచారం.

Advertisement
Advertisement