వాణీ విశ్వనాథ్‌కు వర్మ ఘాటైన కౌంటర్‌! | Sakshi
Sakshi News home page

వాణీ విశ్వనాథ్‌కు వర్మ ఘాటైన కౌంటర్‌!

Published Fri, Oct 13 2017 7:44 PM

Ram gopal varma's counter to vani vishwanath

సాక్షి, హైదరాబాద్‌: దివంగత ఎన్టీ రామారావు జీవితకథ ఆధారంగా 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా తీస్తానంటూ మరో సంచలనానికి దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరతీసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ జీవితంలోని మరోకోణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తానని ప్రకటించి.. ఆర్జీవీ మరింతగా అంచనాలు పెంచేశారు. టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్‌ జీవితంపై సినిమా తీస్తానని ప్రకటించడంతో ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే వర్మపై మండిపడుతూ పలువురు టీడీపీ నేతలు కామెంట్‌ చేశారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే అనిత తదితరులు వర్మపై విరుచుకుపడ్డారు. తాజాగా నటి వాణీ విశ్వనాథ్ సైతం వర్మకు వార్నింగ్‌ ఇచ్చారు. ఎన్టీఆర్‌ జీవితకథ ఆధారంగా సినిమా తీస్తే ఆయన అభిమానులతో కలిసి వర్మ ఇంటి ముందు ధర్నాకు దిగుతానని హెచ్చరించే ప్రయత్నం చేశారు.

అయితే, ఇలాంటి హెచ్చరికలను పెద్దగా పట్టించుకోని వర్మ.. వాణీ విశ్వనాథ్‌కు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. తనకు అసలు ఇల్లే లేదని, రోడ్ల మీద తిరుగుతూ ఉంటానని, తనను వెతుక్కుంటూ రోడ్ల మీద తిరిగితే మీ సున్నితమైన మీ పాదాలు కమిలిపోవూ.. అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఫేస్‌బుక్‌లో వర్మ చేసిన పూర్తి కామెంట్‌ ఇది (యథాతథంగా).

Advertisement
Advertisement