చెడ్డవారికి దసరా శుభాకాంక్షలు : వర్మ | Sakshi
Sakshi News home page

చెడ్డవారికి దసరా శుభాకాంక్షలు : వర్మ

Published Thu, Oct 22 2015 12:01 PM

చెడ్డవారికి దసరా శుభాకాంక్షలు : వర్మ - Sakshi

ఇటీవల కాలం సినిమాలతో కంటే తన ట్విట్టర్ స్టేట్మెంట్స్తోనే ఎక్కువ యాక్టివ్గా కనిపిస్తున్న రామ్ గోపాల్ వర్మ, దసరా పండుగను కూడా వదిలి పెట్టలేదు. మంచి చెడులపై తనదైన విశ్లేషణలతో చెలరేగిపోయాడు వర్మ. దేవుడంటే తనకు గౌరవం లేదని చెప్పుకునే వర్మ తన అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసే విషయంలో కూడా తన పంథా కొనసాగించాడు.

'చెడు మీద మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుంది. అయితే మంచి... చెడుగా నిరూపించబడనంత వరకే మంచిగా ఉంటుంది. చెడు కూడా చెడ్డ వారికి మంచిగానే అనిపిస్తుంది. అమెరికా హిట్లర్ అనే రాక్షసున్ని చంపి మంచి చేసింది, అయితే ఆ మంచి 30 మిలియన్ల ప్రజలు మరణించాకే జరిగింది. అంటే ఆ చనిపోయినా వారు మంచి వారా..? చెడ్డ వారా..? మీకు చెడు అనిపించింది నాకు మంచి అనిపించవచ్చు. నాకు మంచి అనిపించింది మీకు చెడు అనిపించవచ్చు.

చెడ్డ వారికి మంచి చెడుగాను, మంచి వారు, చెడ్డవారుగాను కనిపిస్తారు. ధనవంతులు అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు, పేదవారు ఓడిపోతారు. అంటే ధనవంతులు మంచి వారు, పేదవారు చెడ్డవారా..? నాకు తెలిసి నేను మంచి వాణ్ని, నన్ను చెడ్డవాడిగా భావించే వారంతా చెడ్డవారే'. అంటూ వింత వింత ట్వీట్స్ తో ఫాలోవర్స్ను కన్ఫ్యూజ్ చేశాడు. ఫైనల్ గా మంచి వారిచే బాధించబడుతున్న చెడ్డవారందరికీ దసరా శుభాకాంక్షలు' అంటూ తన ట్వీట్లను ముగించాడు వర్మ.

 

Advertisement
Advertisement