పెళ్లి డేట్పై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య | Sakshi
Sakshi News home page

పెళ్లి డేట్పై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య

Published Sun, Sep 18 2016 1:26 PM

పెళ్లి డేట్పై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య - Sakshi

అక్కినేని ఫ్యామిలీలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయన్న వార్త అభిమానులను ఖుషీ చేస్తోంది. అయితే అఖిల్ నిశ్చితార్ధం విషయంలో క్లారిటీ ఇచ్చిన నాగ్, పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి డేట్ను మాత్రం ప్రకటించలేదు. దీంతో చాలా రోజులుగా నాగచైతన్య, సమంతల పెళ్లి విషయంలో రకారకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశాడు అక్కినేని నాగచైతన్య.

చెన్నైలో జరిగిన సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ లాంచ్లో పాల్గొన్న నాగచైతన్య తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చాడు. సమంతతో మీ పెళ్లి ఎప్పుడూ అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. ప్రస్తుతానికి డేట్ ఫిక్స్ అవ్వలేదు. వచ్చే ఏడాదిలో ఉంటుంది అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో అఖిల్ నిశ్చితార్ధం ముందుగా జరిగిన నాగచైతన్య పెళ్లి తరువాతే అఖిల్ పెళ్లి ఉంటుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

Advertisement
Advertisement