Sakshi News home page

ఆయన గురించి మా అమ్మా, నాన్నకే చెబుతా!

Published Sun, May 10 2015 8:46 AM

ఆయన గురించి మా అమ్మా, నాన్నకే చెబుతా!

 ఔనూ.. మీరు డెన్మార్క్ బ్యాడ్‌మింటన్ ప్లేయర్ మతియాస్ బోతో ప్రేమలో పడ్డారట? అని తాప్సీని సూటిగా అడిగితే.. అంతే సూటిగా ‘‘అసలా విషయం బయటివాళ్లకు ఎందుకు చెప్పాలి?’’ అంటారామె. ఇలాంటివన్నీ వ్యక్తిగత విషయాలనీ, అవి పబ్లిక్‌కి చెప్పాల్సిన అవసరం లేదని కూడా తాప్సీ అన్నారు.

ఒకవేళ ప్రేమలో పడితే.. ఆ విషయం మా అమ్మా, నాన్నలకు మాత్రమే చెబుతానని కూడా స్పష్టం చేశారామె. సరే.. అసలు మతియాస్ బో మీ సినిమాలు చూస్తారా? అనడిగితే... ‘‘అది ఆయన్ను అడగాలి కానీ, నన్నడిగితే నేనేం చెప్పను’’ అన్నారు. సో.. మతియాస్ గురించి ఏమీ మాట్లాడకూడదని తాప్సీ బలంగా ఫిక్సయ్యారని తెలుస్తోంది కదూ...!
 

Advertisement

What’s your opinion

Advertisement