స్ట్రయిట్‌ తెలుగు సినిమాలు నిర్మిస్తా

30 Dec, 2019 06:36 IST|Sakshi

‘‘గౌతమ్‌ మీన¯Œl గారి సినిమాల్లో మొదట్లో రొమాన్స్‌ ఉంటే క్లైమాక్స్‌లో యాక్ష¯Œ  ఉంటుంది. కానీ ‘తూటా’లో 70 శాతం యాక్ష¯Œ  ఉంటుంది’’ అని తాతారెడ్డి అన్నారు. ధనుష్‌ హీరోగా గౌతమ్‌ మీన¯Œ  దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఎన్నై నోకి పాయమ్‌ తోట’. మేఘా ఆకాష్‌ కథానాయికగా నటించారు. ఈ చిత్రం ‘తూటా’  పేరుతో తెలుగులో విడుదల కానుంది. గొలుగూరి రామకృష్ణారెడ్డి సమర్పణలో విజయభేరి పతాకంపై జి.తాతారెడ్డి, జి.సత్యానారాయణ రెడ్డి జనవరి 1న ‘తూటా’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తాతారెడ్డి మాట్లాడుతూ –‘‘ఎమ్మెస్‌ బయో టెక్నాలజీ చదివి సైంటిస్ట్‌గా రెండేళ్లు పని చేశాను. సినిమాలపై నాకున్న ఆసక్తితో  ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’, ‘లవర్స్‌ డే’ చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేశాను.  ‘తూటా’ సినిమాతో నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు హ్యాపీ.  ‘తూటా’లో కథనం ప్రకారం కుటుంబకథకు అండర్‌ వరల్డ్‌ టచ్‌ ఉంటుంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ‘తూటా’లో మార్పులు చేశాం.. స్క్రీ¯Œ  ప్లే స్పీడ్‌గా సాగుతుంది. ప్రేక్షకులకు ఇది స్ట్రయిట్‌ తెలుగు చిత్రంలానే అనిపిస్తుంది. స్ట్రయిట్‌ తెలుగు సినిమాలను నిర్మిస్తాను. ‘మీతో వర్క్‌ చేయడం కంఫర్ట్‌గా ఉంటుంది.. ఓ సినిమా చేస్తా’ అని గౌతమ్‌ మీన¯Œ గారు ఓ సందర్భంలో నాతో అన్నారు. మంచి కథ కుదిరితే కొత్త దర్శకులతోనూ సినిమాలు నిర్మిస్తాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు