బన్నీ, నాగ్ల మల్టీ స్టారర్ | Sakshi
Sakshi News home page

బన్నీ, నాగ్ల మల్టీ స్టారర్

Published Sun, Feb 28 2016 8:28 PM

బన్నీ, నాగ్ల మల్టీ స్టారర్ - Sakshi

ఇప్పటి వరకు సోలో స్టార్ ఇమేజ్ కోసం పాకులాడిన మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే వెంకటేష్, మహేష్ బాబు,  పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోలు ఈ కోవలో సినిమాలు చేయగా ఇప్పుడు మరింత మంది మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.

తాజాగా అల్లు అర్జున్, నాగార్జున కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నారన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం నితిన్ హీరోగా అ..ఆ సినిమాను తెరకెక్కిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ సినిమా తరువాత బన్నీ, నాగ్ల కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు ప్రారంభించాడట. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా.. ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వస్తే టాలీవుడ్లో ఇది మరో భారీ మల్టీ స్టారర్ సినిమాగా క్రేజ్ సొంతం చేసుకుంటుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement