విజయవాడ నగరంలోఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన కొంతమంది వ్యక్తులు, కొన్ని సంఘటనలు ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ ‘వంగవీటి’ సినిమా చేయబోతున్నానని అనౌన్స్ చేయగానే సినిమాపై చాలా ఆసక్తి పెరిగింది. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేసిన వంగవీటి ట్రైలర్‌కు రెండు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ``విజయవాడ రౌడీయిజంపై నా దర్శకత్వంలో రూపొందుతోన్న `వంగవీటి` నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. అప్పట్లో అక్కడ జరిగిన చాలా సంఘర్షణలకు నేను ప్రత్యక్షసాక్షిని. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రవి శంకర్ మ్యూజిక్‌లో రూపొందిన మిగిలిన పాటలు కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. డిసెంబర్ 3న వంగవీటి ఆడియో విడుదల కార్యక్రమాన్ని విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో పలువురి ప్రముఖుల సమక్షంలో విడుదల చేయనున్నాం. ఇప్పుడు నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ`ని తెలిపారు.
ఈ సినిమాకు సాహిత్యం సిరాశ్రీ, చైతన్యప్రసాద్ అందించారు. సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్, కె.దిలీప్ వర్మ, సూర్య చౌదరి, ఎడిటర్: సిద్ధార్థ్ తాతోళ్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విస్సు.
`వంగవీటి` విడుదల తేదీ ప్రకటించిన వర్మ
Published Tue, Nov 29 2016 7:42 PM
Advertisement
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
What’s your opinion
Advertisement