Sakshi News home page

2జీ నిందితుడు బల్వాపై జడ్జి ఆగ్రహం

Published Sun, May 11 2014 1:05 AM

2G accused balvapai    Judge angry

కస్టడీలోకి తీసుకునేందుకు అర్హుడేనని వ్యాఖ్య

న్యూఢిల్లీ: స్వాన్ టెలీకామ్ ప్రమోటర్, 2జీ స్పెక్ట్రం కేటాయింపుల కుంభకోణంలో నిందితుడు షాహిద్ ఉస్మాన్ బల్వాపై ఢిల్లీ కోర్టు జడ్జి శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  విచారణ సమయంలో బల్వా తీరుతో ఇబ్బందులకు గురైన స్పెషల్ సీబీఐ జడ్జి ఓపీ సైనీ.. బల్వాను కస్టడీలోకి తీసుకోవడానికి అర్హుడేనని చెప్పారు. వాంగ్మూలం రికార్డు చేసే సమయంలో చాలాసార్లు ఆయన్ను కస్టడీలోకి తీసుకోవాల్సిందే అని అనిపించిందని జడ్జి పేర్కొన్నారు.

బల్వాపై తనకు నమ్మకం లేదని అందరికీ చెప్పానని అన్నారు. బల్వా కోర్టును మోసం చేశారని, ఇక తన సహనం నశించిందని జడ్జి మండిపడ్డారు. కోర్టు అడుగుతున్న ప్రశ్నలు తనకు అర్థం కావడం లేదని చెబుతున్న బల్వా.. 500 ప్రశ్నలకు ఎలా బదులిచ్చారని ప్రశ్నించారు. జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలని బల్వాను హెచ్చరించారు. తాను మోసం చేయడానికి ప్రయత్నించలేదని పదే పదే కోర్టుకు చెప్పిన బల్వా.. తనను క్షమించమని పలుమార్లు అభ్యర్థించారు. తదుపరి విచారణను మే 12కు వాయిదా వేశారు.
 
 

Advertisement

What’s your opinion

Advertisement