ఆపరేషన్ తర్వాతే మాపాప కిడ్నీలు మాయం! | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ తర్వాతే మాపాప కిడ్నీలు మాయం!

Published Tue, May 26 2015 6:39 PM

ఆపరేషన్ తర్వాతే మాపాప కిడ్నీలు మాయం! - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో దీపిక అనే నాలుగేళ్ల బాలిక కిడ్నీలు మాయం కావడంపై తండ్రి  పవన్ కుమార్ పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. ఎయిమ్స్ డాక్టర్లు ఆపరేషన్ చేసిన తర్వాతే తన పాప కిడ్నీలు మాయం అయ్యాయని ఆందోళన వ్యక్తం చేశాడు.  దీనిపై పోలీసు ఫిర్యాదు ఇచ్చినట్లు పేర్కొన్నాడు.ఈ అంశానికి సంబంధించి పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని కోరాడు.

వివరాల్లోకి వెళితే.. యూపీలోని రాయ్బరేలీకి చెందిన పవాన్.. తోపుడు బండిమీద జ్యూస్ అమ్ముకుంటూ జీవిస్తున్నాడు. అతని ఆరేళ్ల కూతురు దీపిక కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. స్థానిక వైద్యుల సూచనమేరకు చికిత్స నిమిత్తం గత డిసెంబర్లో ఢిల్లీలోని ఎయిమ్స్ వచ్చారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం దీపిక ఎడమ కిడ్నీలో లోపం ఉందని, కుడి కిడ్నీ బాగానే పనిచేస్తోందని, కుటుంబ సభ్యులు అంగీకరిస్తే చెడిపోయిన కిడ్నీని తొలిగిస్తామని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. ఆ క్రమంలోనే ఈ ఏడాది మార్చి 17న ఆపరేషన్ నిర్వహించారు.ఆ పాపకు పీడియాట్రిక్ విభాగంలో సీనియర్ సర్జన్ ఒకరు ఆపరేషన్ చేశారు.

అయితే ఆ తరువాత జరిపిన పరీక్షల్లో దీపిక రెండు కిడ్నీలు కనబడకపోవడంతో ఇటు తల్లిదండ్రులు సహా ఆసుపత్రి సిబ్బంది సైతం అవాక్కయ్యారు. అసలేం జరిగిందని ఆపరేషన్ నిర్వహించిన వైద్యుడ్ని అడిగితే.. 'మీ అమ్మాయికి ఉన్నది ఒకే ఒక్క కిడ్నీ. దానినే నేను తీసేశా. రెండు కిడ్నీలు లేనేలేవు' అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో డయాలసిస్ పై చికిత్స అందిస్తున్నారు.

Advertisement
Advertisement