కేరళలో భారీ పనస పండు | Sakshi
Sakshi News home page

కేరళలో భారీ పనస పండు

Published Thu, May 14 2020 1:51 PM

51.4kg Jackfruit found in Kerala - Sakshi

కొల్లాం : పనస తొనల తియ్యదనం చెప్పాలంటే మాటలు చాలవు. పనస పొట్టు కూర ప్రత్యేక మైన రుచితో శాఖాహారుల నోరూరిస్తూ ఉంటుంది. వేసవికాలం వచ్చిందంటే పనసపండ్లు అందుబాటులోకి వస్తాయి. పండ్లజాతిలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద పండుగా పేరున్న పనసపండు సాధారణంగా 5 కేజీల నుంచి 20 కేజీల బరువుతో కాస్తాయి.

అయితే కేరళలోని కొల్లాంలో ఎదాములక్కల్‌ గ్రామానికి చెందిన ఓ కుటుంబం తమ పొలంలో కాసిన పనస పండు ఏకంగా 50 కేజీలకుపైగానే తూగడంతో వారి ఆనందానికి అవుధులు లేకుండా పోయింది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత బరువైన పనసపండు 42.7 కిలోలు అవ్వడంతో, వారు గిన్నిస్‌ బుక్‌ వారి సంప్రదించారు. తమ పొలంలో కాసిన పనస 51.4 కిలోల బరువుతో 97 సెంటిమీటర్ల వెడల్పుతో ఉందని జాన్‌ కుట్టి అన్నారు. గిన్నిస్‌ బుక్‌తోపాటూ లిమ్కా బుక్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులకు కూడా దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు.

Advertisement
Advertisement