Sakshi News home page

‘అవమానాలు ఎదుర్కొని.. అమృతం పంచారు’

Published Fri, Apr 14 2017 3:06 PM

‘అవమానాలు ఎదుర్కొని.. అమృతం పంచారు’ - Sakshi

నాగ్‌పూర్‌: భీమ్‌-ఆధార్‌ యాప్‌ను భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు అంకితం చేస్తున్నానని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. శుక్రవారం నాగ్‌పూర్‌లోని అంబేద్కర్‌ స్మారక స్థలం దీక్షా భూమిని సందర్శించి అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఆయన అనంతరం డిజిటల్‌ లావాదేవీల పెంపుకోసం భీమ్‌-ఆధార్‌ యాప్‌ను ప్రారంభించి అంబేద్కర్‌కు అంకితం చేశారు. భీమ్‌-ఆధార్‌ యాప్‌ వినియోగంతో ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు అని అన్నారు.

కేవలం వేలిముద్రతో చెల్లింపులు చేయొచ్చని చెప్పారు. మార్కెట్‌లో నగదు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని చెప్పారు. 2022లోగా అందరికీ ఇళ్లు ఉంటాయని మోదీ చెప్పారు. అంతకుముందు అంబేద్కర్‌కు నివాళులు అర్పించిన మోదీ దీక్షా భూమిలో అంబేద్కర్‌ కోసం ప్రార్థించడం తనకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. దళితులు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం శ్రమించారని అన్నారు. అంబేద్కర్‌ను శివుడితో మోదీ పోల్చారు. ఆయన జీవిత కాలంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని దేశ ప్రజలకు మాత్రం అమృతాన్ని పంచారని కొనియాడారు.

Advertisement

What’s your opinion

Advertisement