‘జడ్జీల కమిషన్’కు రాజ్యాంగ బద్దత | Sakshi
Sakshi News home page

‘జడ్జీల కమిషన్’కు రాజ్యాంగ బద్దత

Published Tue, Dec 10 2013 12:50 AM

Constitutional Status for Judicial Appointment Panel Sought

న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకం, బదిలీల కోసం ఏర్పాటు చేయాలనుకుంటున్న ‘జుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ (జేఏసీ)’కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలని సంబంధిత పార్లమెంటరీ స్థాయీసంఘం సిఫారసు చేసింది. విపక్ష బీజేపీ, న్యాయ నిపుణుల డిమాండ్ మేరకు ‘స్టాండిండ్ కమిటీ ఆన్ లా అండ్ పర్సనల్’ ఈ నిర్ణయం తీసుకుని, సంబంధిన నివేదికను సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కమిషన్ సభ్యుల సంఖ్యతో పాటు, దాని విధులను కూడా రాజ్యాంగంలో చేర్చాలని పేర్కొంది. ఆ సిఫారసు కార్యరూపం దాలిస్తే సాధారణ చట్టాల ద్వారా జేఏసీ సభ్యులకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయడానికి అవకాశం ఉండదు.

Advertisement
Advertisement