'రుతుపవనాల రాక పై భయం వద్దు' | Sakshi
Sakshi News home page

'రుతుపవనాల రాక పై భయం వద్దు'

Published Thu, Jun 4 2015 6:10 PM

'Fears Based on Advance Monsoon Predictions Misplaced': Finance Minister Arun Jaitley


ఢిల్లీ:

జీఎస్‌టీ అమలుకు సంబంధించి రాష్ట్రాల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో ఢిల్లీలో బుధవారం ఎంపవర్డ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడారు.

'రుతుపవానాలు ఆర్థిక వ్యవస్థ పై తీవ్రప్రభావాన్ని చూపుతున్నాయి.  భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచనల ప్రకారం దేశంలో ఈ ఏడాది వర్షపాతం మమూలుగానే నమోదయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే తగినంతగా నిల్వలు ఉండటంతో రుతుపవనాల ప్రభావం ఆహార ధాన్యాల ఉత్పత్తిపై ప్రభావం ఉండకపోవచ్చు. రుతుపవనాల అంచనాలపై భయపడాల్సిన అవసరం లేదు. గత సంవత్సరం రుతుపవనాల రాక ఆలస్యం అయినా..ప్రభుత్వం ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేయగలిగింది'. అని  ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు.
 

Advertisement
Advertisement