తొలి మహిళా కమాండోల టీమ్ | Sakshi
Sakshi News home page

తొలి మహిళా కమాండోల టీమ్

Published Mon, Nov 17 2014 12:38 AM

first women commando's team

న్యూఢిల్లీ: దేశంలోనే తొలిసారి మావోయిస్టుల ఏరివేతకు మహిళా టీమ్‌లు రంగంలోకి దిగాయి. నక్సల్స్ ఏరివేతకు మహిళా ప్రత్యేక దళాలు అడవుల్లో మోహరించింది. దీంతో మహిళా కమాండోలు ఉన్న దేశాల సరసన భారత్ చేరింది. సీఆర్‌పీఎఫ్ ఆధ్వర్యంలో ఈ టీమ్ పనిచేస్తుంది. ఇటీవలే రెండు మహిళా జట్టులను సహచర పురుషుల జట్టుతో పాటు మావోయిస్టులపై గస్తీ కోసం పంపారు. మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్త్రా జిల్లాకు ఒక టీమ్ వెళ్లగా, మరో టీమ్ జార్ఖండ్ వెళ్లింది. వీరందరితో రెండు ప్లాటూన్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లాటూన్‌లో 35 మంది మహిళలు ఉంటారు.

 

ఈ మహిళలతో అడవుల్లోని గ్రామీణుల్లో అవగాహన కల్పిస్తారు. మావోయిస్టుల్లో చేరివేతలు లేకుండా నిర్మూలించడం, ఉన్నవారు జనజీవన స్రవంతిలో కలిసేలా చేయడం వీరి విధి. ఈ చర్యలు పశ్చిమబెంగాల్‌లో ఫలితాలను ఇచ్చాయి. సీఆర్‌పీఎఫ్ మావోయిస్టుల ఏరివేత కోసమే 90,000 మందిని సిద్ధం చేసింది. వీరు జార్ఖండ్, చత్తీస్‌గఢ్ అడవుల్లో ఏరివేత కొనసాగిస్తారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement