కేంద్రమంత్రి నజ్మా హెప్తుల్లా వివాదస్పద వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి నజ్మా హెప్తుల్లా వివాదస్పద వ్యాఖ్యలు

Published Fri, Aug 29 2014 3:59 PM

కేంద్రమంత్రి నజ్మా హెప్తుల్లా వివాదస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: భారతీయ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మైనారిటీ శాఖామంత్రి నజ్మా హెప్తుల్లా కొత్త వివాదానికి తెర తీశారు. భారతీయులందర్ని 'హిందీ' అంటూ  చేసిన వ్యాఖ్యలు దుమారం లేపడంతో తర్వాత ఆమె వివరణ ఇచ్చారు. హిందీ అనే పదం మతానికి సంబంధించినది కాదని, కేవలం జాతీయతగానే చూడాలని నజ్మా చెప్పారు. భారతీయులందరూ హిందువులని అనలేదని ఆమె తెలిపారు. 
 
అరబిక్ భాషలలో భారతీయులను హిందీ, హిందుస్థానీ అనే పదాలతో పిలుస్తారని అన్నారు. జాతీయత సూచించే విధంగా హిందీ, హిందుస్థానీ అంటామని వివరణలో భాగంగా పేర్కోన్నారు. భారతీయులను హిందువులుగానే చూడాలని ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై నజ్మా హెప్తుల్లా వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. భారతీయుందరూ హిందీ(హిందువులు) అని నజ్మా హెప్తుల్లా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం లేపింది

Advertisement
Advertisement