‘నేను వాస్తవాలే చెప్పా, ఆధారాలున్నాయి’ | Sakshi
Sakshi News home page

‘నేను వాస్తవాలే చెప్పా, ఆధారాలున్నాయి’

Published Thu, May 4 2017 3:51 PM

‘నేను వాస్తవాలే చెప్పా, ఆధారాలున్నాయి’ - Sakshi

న్యూఢిల్లీ:  కేసీఆర్‌ ప్రభుత్వం తనపై కేసు నమోదు చేయడాన్ని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌, ఏఐసీసీ కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌ స్వాగతించారు. తాను వాస్తవాలే చెప్పానని, తన దగ్గర ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని ఆయన మరోసారి స్పష్టం చేశారు. చట్టపరంగానే పోలీస్‌ కేసును ఎదుర్కొంటానని దిగ్విజయ్‌ తెలిపారు.

నకిలీ వెబ్‌సైట్‌ పెట్టి ముస్లిం యువతను ఐసిస్‌ వైపు రెచ్చగొట్టారని ఆరోపిస్తూ చేసిన ట్వీట్లను తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శాఖ సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. కాగా దిగ్విజయ్‌ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో దిగ్విజయ్‌పై 505 1ఏ, 1బీ, క్లాస్‌ 2 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

మరోవైపు దిగ్విజయ్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మూడు రకాలుగా కేసులు నమోదు చేయాలని తెలంగాణ పోలీస్‌ శాఖ భావిస్తోంది. రాష్ట్ర పోలీసులపై నిరాధార ఆరోపణలు చేసినందుకు పరువు నష్టం కేసుతోపాటు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఒక వర్గాన్ని తప్పుదారి పట్టిం చేలా వ్యవహరించినందుకు మరో కేసు, రాష్ట్రంలో శాంతిభద్రతల విఘాతానికి కుట్ర పన్నేలా ట్వీట్‌ చేసిందుకు ఇంకో కేసు నమో దు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర న్యాయ శాఖ నుంచి సలహా తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

Advertisement
Advertisement