బీఎస్ఎఫ్ విమాన ప్రమాద మృతులకు నివాళి | Sakshi
Sakshi News home page

బీఎస్ఎఫ్ విమాన ప్రమాద మృతులకు నివాళి

Published Wed, Dec 23 2015 10:22 AM

rajnath singh pays homage to personnel who died in BSF plane crash

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో జరిగిన ఘోర  విమాన ప్రమాదంలో మృతి చెందినవారికి కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం నివాళులు అర్పించారు.  బీఎస్ఎఫ్ సరిహద్దు భద్రతా దళానికి(బీఎస్‌ఎఫ్) చెందిన 11 సీట్ల విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న 3 నిమిషాలకే నగర శివార్లలోని ద్వారక సమీపంలో మంగళవారం కుప్పకూలిన విషయం తెలిసిందే. విమానంలోని ఇద్దరు పైలట్లతోపాటు ఎనిమిది మంది సాంకేతిక సిబ్బంది దుర్మరణం చెందారు. రాజ్నాథ్ సింగ్ ఇవాళ ఉదయం భౌతికకాయాలపై పుష్పగుచ్ఛాలు ఉంని అంజలి ఘటించారు.

మృతుల్లో.. చీఫ్ పైలట్, బీఎస్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ భగవతి ప్రసాద్ భట్, కో పైలట్, సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) అధికారి రాజేశ్ శివ్‌రేన్, డిప్యూటీ కమాండెంట్ డి. కుమార్, ఇన్‌స్పెక్టర్లు రాఘవేంద్ర కుమార్ యాదవ్, ఎస్.ఎన్. శర్మ, ఎస్‌ఐలు రవీంద్ర కుమార్, సురేంద్ర సింగ్, సి.ఎల్. శర్మ, ఏఎస్‌ఐ డి.పి. చౌహాన్, కానిస్టేబుల్ కె.ఆర్. రావత్ ఉన్నారు. వారికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి.

Advertisement
Advertisement