ట్రాన్స్‌జెండర్‌ను అనుమతించని శబరిమల అధికారులు | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌జెండర్‌ను అనుమతించని శబరిమల అధికారులు

Published Fri, Dec 15 2017 1:12 PM

Sabarimala authorites sent back to Transgender - Sakshi

సాక్షి,శబరిమల : శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చిన ఒక ట్రాన్స్‌జెండర్‌ (లింగ మార్పిడి చేసుకున్న వ్యక్తి)ని అధికారులు లోపలకు అనుమతించలేదు. తమిళనాడు నుంచి వచ్చిన ట్రాన్స్‌జెండర్‌.. గురువారం సాయంత్రం అయ్యప్ప దర్శనానికి సన్నిధానం చేరుకున్నారు. వెళ్లూరుకు చెందిన మోహన్‌ (30) ఇతర స్వాముల మాదిరగానే.. 41 రోజుల పాటు దీక్ష చేసినట్లు తెలుస్తోంది.

సన్నిధానం దగ్గర లింగమార్పిడి చేయించుకున్న మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో మోహన్‌.. లింగమార్పిడికి సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసుల ముందుంచారు.  అయితే మోహన్‌ సమర్పించిన డాక్యుమెంట్లు సరిగా లేవని పోలీసులు తెలిపారు. సన్నిధానం నుంచి ఇద్దరు పోలీసులు మోహన్‌ను పంబాకు తీసుకు వెళ్లారు.

ఇదిలా ఉండగా.. శబరిమల ఆలయంలోని అయ్యప్పస్వామిని 10-50 ఏళ్ల మధ్యనున్న మహిళలు దర్శించేందుకు వీలు లేదు. అలాగే లింగమార్పిడి చేసుకున్న వారికి కూడా ఈ నియమం వర్తిస్తుంది. మతాచారాలను అందరూ పాటించాల్సిందేనని వాటిని ఎవరూ ధిక్కరించరాదని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఏ పద్మకుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement