బీజేపీ కార్యాలయం ముందు కాల్పులు | Sakshi
Sakshi News home page

బీజేపీ కార్యాలయం ముందు కాల్పులు

Published Mon, Nov 4 2019 8:29 PM

Shots Fired Outside BJP MP Office In Delhi - Sakshi

న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ, ప్రముఖ గాయకుడు హన్స్‌రాజ్ హంస్ కార్యాలయం బయట దుండగుడు సోమవారం కాల్పులు జరిపాడు. తన కారులోనే నుంచే దుండగుడు కాల్పులు జరిపాడు. అయితే కాల్పులు జరిపిన వెంటనే దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ రోహిణీ మిశ్రా మాట్లాడుతూ కాల్పులు జరిపిన దుండగుడు ఎరుపురంగు కుర్తా పైజామా ధరించి ఉన్నాడని , నిందితుడిని గుర్తించామని తెలిపారు. కాగా ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తును ప్రారంభించినట్లు డీసీపీ తెలిపారు.

Advertisement
Advertisement