-
స్నేక్ లవర్.. వైరల్ వీడియో!
సాధారణంగా మనం పాము అని పదం వినిపించగానే వామ్మో అంటూ పరుగులు పెడుతుంటాం. అయితే అందరూ ఒకలా ఉండరు కదా. విషం ఉన్న పాములనైనా సరే మచ్చిక చేసుకోవడం అతడి ప్రత్యేకథం. ఎన్నో ఏళ్లుగా పాములను పట్టి, కొన్నిరోజులు వాటి సంరక్షణ బాధ్యతలు చూసిన తర్వాత అడవిలోకి తీసుకెళ్లి వాటిని వదిలేయడం అతడికి సరదా. అతడే మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ వాసి సలీం ఖాన్. ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా పాము కనిపించిందా.. వెంటనే సలీంకు ఫోన్ కాల్ వెళ్తుంది. కొన్ని నిమిషాల్లో వారి ఇళ్లల్లో ప్రత్యక్షమై పామును పట్టి తీసుకెళ్తాడు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు కేబినెట్ మంత్రులు, ఇతర నేతల ఇళ్లల్లో కూడా పాములు పట్టిన అనంతరం గత నెల సెప్టెంబర్ 23న రెగ్యులర్ డ్యూటీని నిర్వహిస్తుండగా ఓ ఫొటోగ్రాఫర్ ఈ దృశ్యాలను తన కెమెరాలో బంధించి సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు. భోపాల్ సమీపంలోని హోషాంగబాద్ పంచమధి అడవిలో ఈ స్నేక్ లవర్ దాదాపు 350 పాములను వదిలేశాడు. అందులో విషపూరిత కోబ్రాలు కూడా ఉన్నాయి. గోనేసంచిలో ఫారెస్ట్ వద్దకు వచ్చి ఇలా పాములను ఎన్నో పర్యాయలు వదిలేశాను అంటున్నాడు స్నేక్ లవర్ సలీం ఖాన్. పాములు మన శత్రువులు కాదని మిత్రులని, ముఖ్యంగా రైతులకు పంటపొలాల్లో ఎలుకల బెడద నుంచి ఉపయోగపడతాయని చెప్పాడు. ఇటీవల ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో ఆ వీడియో చూసిన వారు సలీం ఈజ్ స్నేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటూ పిలుస్తున్నారు. సాయంత్రం వేళల్లో చాలా చల్లగా ఉంటుందని, ఆ సమయంలో పాములను వదిలేస్తామన్నాడు. చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత పాములను అడవిలో వదిలేసి, అనంతరం వాటికి ఎలాంటి అపాయం జరగకూడదని దేవుడ్ని పూజించి వెళ్లడం ఆయనకు అలవాటుగా మారింది. తన 30ఏళ్ల కెరీర్లో 2,20,000 పాములను ఆ అడవిలో వదిలానని గర్వంగా చెబుతున్నాడు. పగటివేళ అయితే ఎండ వేడిమికి పాములకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నాడు ఈ స్నేక్ లవర్. -
స్నేక్ లవర్.. వైరల్ వీడియో!
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురి మృతి
- Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
- హైదరాబాద్‌లో మినీ కశ్మీర్ అందాలు (ఫొటోలు)
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
- మహిళా పోలీస్‌కే రక్షణ లేదు..
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement