సోనియాపై కేసు కొట్టేసిన న్యూయార్క్ కోర్టు | Sakshi
Sakshi News home page

సోనియాపై కేసు కొట్టేసిన న్యూయార్క్ కోర్టు

Published Thu, Jun 12 2014 6:03 AM

సోనియాపై కేసు కొట్టేసిన న్యూయార్క్ కోర్టు - Sakshi

న్యూయార్క్: 1984 సిక్కు అల్లర్లకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఓ సిక్కుల గ్రూపు వేసిన పిటిషన్‌ను న్యూయార్క్ కోర్టు కొట్టివేసింది. ఆ అల్లర్లకు ఆమెను వ్యక్తిగతంగా బాధ్యురాలిని చేయజాలమని పేర్కొంది. ఈ మేరకు సిక్ ఫర్ జస్టిస్(ఎస్‌ఎఫ్‌జే) వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ జడ్జి బ్రియాన్ కోగన్ 13 పేజీల ఉత్తర్వులు వెలువరించారు.అయితే ఎస్‌ఎఫ్‌జే మరోసారి ఇలాంటి పిటిషన్ వేయకుండా నిరోధిస్తూ ఉత్తర్వులివ్వాలన్న సోనియా గాంధీ వినతిని తోసిపుచ్చారు.

Advertisement
Advertisement