‘ఆ ముగ్గురే హింసించారు.. శిక్షించండి’ | Sakshi
Sakshi News home page

‘ఆ ముగ్గురే హింసించారు.. శిక్షించండి’

Published Mon, Nov 21 2016 6:39 PM

‘ఆ ముగ్గురే హింసించారు.. శిక్షించండి’

న్యూఢిల్లీ: ఢిల్లీలో ముస్లిం విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. జేఎన్యూ స్కాలర్ నజీబ్‌ అహ్మద్ను హింసించి అతడు కనిపించపోవడానికి కారణమైన ముగ్గురు విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్స్ ఆఫ్‌ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్‌ ఇండియా తరుపున పెద్ద మొత్తంలో ర్యాలీ తీశారు. వీరిలో కనిపించకుండా పోయిన నజీబ్ తల్లి ఫాతీమా నఫీజ్ కూడా ఉంది. జేఎన్యూ విద్యార్థులే కాకుండా జామియా మిలియా ఇస్లామియా, అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీకి చెందినవారు కూడా మొత్తంలో ఈ ర్యాలీ పాల్గొన్నారు.

‘అహ్మద్ను వేధింపులకు గురి చేసిన విక్రాంత్, సునీలో్, అంకిత్ లను వెంటనే శిక్షించాలని మేం జేఎన్యూ అధికారిక వర్గాలను కోరుతున్నాం. ప్రాథమిక దర్యాప్తులో కూడా ఇదే విషయం స్పష్టమైనందున వెంటనే అధికారులు ఆ పనిచేయాలి’ అని వారంతా డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు పోలీసులు అహ్మద్ను గుర్తించలేకపోయారని తప్పు బట్టారు. జేఎన్యూలో ఎంఎస్సీ విద్యార్థి అయిన అహ్మద్ కనిపించకుండా పోయి ఇప్పటికీ 36 రోజులు. ఏబీవీపీ విద్యార్థులు అతడిపై చేయి చేసుకున్న తర్వాతే అహ్మద్ కనిపించకుండా పోయాడని ఆరోపణలు వచ్చాయి. విద్యార్థి విభాగం ఎన్నికల నేపథ్యంలో అహ్మద్ గదికి వచ్చిన విద్యార్థుల మధ్య గొడవ జరిగినట్లు సమాచారం.

Advertisement
Advertisement