1995 నాటి ‘హిందుత్వ’ తీర్పుపై సుప్రీంకోర్టు సమీక్ష | Sakshi
Sakshi News home page

1995 నాటి ‘హిందుత్వ’ తీర్పుపై సుప్రీంకోర్టు సమీక్ష

Published Mon, Feb 3 2014 1:21 AM

supreme court review on 1995 hindhuism judgement

 న్యూఢిల్లీ: ఎన్నికల ప్రయోజనాల కోసం మతాన్ని దుర్వినియోగం చేయడం అవినీతిపూర్వక చర్య కిం దకే వస్తుందని ప్రజా ప్రాతినిధ్య చట్టంలో పేర్కొనడంపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ ప్రారంభిం చనుంది. దానికి సంబంధించి సాధికార తీర్పునిచ్చే దిశగా ఏడుగురు న్యాయమూర్తుల విసృ్తత ధర్మాసనం విచారణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. అందుకు దారితీసిన కారణాలు..
 
     హిందుత్వ లేదా హిందూయిజం పేరున వేసే వోటు ఏ అభ్యర్థి విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపవని మనోహర్ జోషి వర్సెస్ ఎన్‌బీ పాటిల్ కేసుకు సంబంధించి 1995లో సుప్రీం తీర్పునిచ్చింది. హిందుత్వ అనేది భారత ప్రజల జీవనవిధానమని, అది ఒక మానసిక స్థితి అని ఆ తీర్పులో త్రిసభ్య బెంచ్ పేర్కొంది. మహారాష్ట్రలో మొదటి హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల సందర్భంగా జోషీ చేసిన వ్యాఖ్యపై పాటిల్ ఈ కేసు వేశారు. నాటినుంచి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123(3)పై 3 పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
 
     1990లో మహారాష్ట్ర అసెంబ్లీకి బీజేపీ తరఫున అభిరామ్‌సింగ్ ఎన్నికయ్యారు. పైన పేర్కొన్న సెక్షన్ ఆధారంగా బాంబే హైకోర్టు ఆ ఎన్నికను 1991లో నిలిపేసింది. దాంతో ఆయన సుప్రీం కెళ్లారు. ఆ పిటిషన్‌కు సంబంధించి సెక్షన్ 123 (3)పై వివరణ అంశం జనవరి 30న సుప్రీంకోర్టులోని జస్టిస్ ఆర్‌ఎం లోధా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచ్ ముందుకు వచ్చింది. అయితే, దానిని ఆ ధర్మాసనం ఏడుగురు సభ్యుల విసృ్తత ధర్మాసనానికి నివేదించింది.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement