సస్పెండైన మహిళా కానిస్టేబుల్పై అత్యాచారం | Sakshi
Sakshi News home page

సస్పెండైన మహిళా కానిస్టేబుల్పై అత్యాచారం

Published Sun, May 17 2015 6:47 PM

Suspended Delhi Police constable alleges rape at gunpoint

గుర్గావ్: సస్పెండైన మహిళా కానిస్టేబుల్ను ఓ వ్యక్తి తుపాకీతో బెదిరించి రెండు పర్యాయాలు అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు డీఎల్ఎఫ్-2 పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

ఢిల్లీ పోలీసు శాఖలో పనిచేసే మహిళా కానిస్టేబుల్ లంచం కేసులో సస్పెండ్ అయ్యింది. ఆమె (38) రాజీవ్ కాలనీలో నివాసం ఉంటోంది. సలీం అనే వ్యక్తి 2012లో తుపాకీతో బెదిరించి ఓ గెస్ట్ హౌస్లో తనపై లైంగిక దాడికి పాల్పిడినట్టు ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల సలీం మరోసారి తనపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు చెప్పింది. సలీం మరో నలుగురు సహకరించినట్టు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.

 

Advertisement
Advertisement