యూపీలో దారుణం!

26 Sep, 2015 18:50 IST|Sakshi
యూపీలో దారుణం!

లక్నో : ఉత్తరప్రదేశ్ లోని ప్రతాఫ్ఘర్ లో దారుణం చోటుచేసుకుంది. భూవివాదాల నేపథ్యంలో ఓ మహిళ సహా నలుగురు వ్యక్తులు కలిసి ఓ యువతిని సజీవదహనం చేసే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై బాధితురాలి తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రతాప్ ఘర్ లోని సిర్పూర్ గ్రామంలో కూలీ పనికి వెళ్లి ఇంటికి తిరిగొస్తున్న యువతిని నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. ఓం ప్రకాశ్ మౌర్య, అతడి భార్య, మరో ఇద్దరు కలిసి యువతిపై కిరోసిన్ పోసి ఆమెను కాల్చివేసే ప్రయత్నం చేశారు. మంటలవేడిమికి భరించలేక ఆ యువతి కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ ఘటనలో ఆమె దేహం చాలా వరకు కాలిపోయింది. కాలిన గాయాలతో పడిఉన్న బాధితురాలిని అలహాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భూ వివాదం నేపథ్యంలోనే ఆ యువతిని ప్రత్యర్థి వర్గాలు చంపాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు