మెదడు నుంచి మెదడుకు తొలి సందేశం! | Sakshi
Sakshi News home page

మెదడు నుంచి మెదడుకు తొలి సందేశం!

Published Fri, Sep 5 2014 11:51 PM

మెదడు నుంచి మెదడుకు తొలి సందేశం!

భారత్‌లో ఒక వ్యక్తి ఆలోచించాడు. ఫ్రాన్స్‌లో మరో వ్యక్తి ఆ ఆలోచనను గ్రహించాడు. వీడియోలు, ఆడియోలు, మాటలు లేకుండానే.. ఇద్దరికీ ఎలాంటి సంబంధం లేకుండా ఇంటర్నెట్‌తో ఇది జరిగిపోయింది! మనుషుల మెదళ్ల మధ్య సమాచార ప్రసారాన్ని సాధ్యం చేసే ‘బ్రెయిన్-టు-బ్రెయిన్ కమ్యూనికేషన్’లోని ఈ ప్రక్రియను హార్వార్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు మొదటిసారిగా ఇద్దరు మనుషుల మధ్య సాధించారు. ఒక వ్యక్తి మెదడులోని ప్రేరేపణలను మరో వ్యక్తి మెదడుకు అందిస్తే.. అతడు ఆ భావాలను అర్థం చేసుకుంటాడా? లేదా? అన్న కోణంలో వీరు ఈ ప్రయోగం చేపట్టారు.

తొలుత భారత్‌లో ఓ వ్యక్తి మెదడుకు ఎలక్ట్రోఎన్‌సెఫలోగ్రామ్ (ఈఈజీ)ను, ట్రాన్స్‌క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్(టీఎంఎస్)ను అమర్చారు. తర్వాత అతడు ‘హోలా(స్పానిష్‌లో హలో)’, ‘సియావో(ఇటాలియన్‌లో హలో)’ అనే పదాల గురించి ఆలోచించాడు. ఈ ఆలోచనల వల్ల మెదడులో కలిగిన మార్పులను రికార్డు చేసి ఫ్రాన్స్‌లోని వ్యక్తికి అమర్చిన ఈఈజీ, టీఎంఎస్‌లకు పంపించారు. అతడు ఈ పదాలను గ్రహించాడు. దీంతో మాటలు లేకుండానే ఇద్దరి మధ్యా పదాలు మార్పిడి జరిగింది.
 
 

Advertisement
Advertisement