టుడే న్యూస్‌ రౌండప్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Wed, Jan 3 2018 6:52 PM

today news roundup - Sakshi

సాక్షి, కలికిరి(చిత్తూరు) : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలోని కలికిరి వద్ద నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ‘పెద్ద పులి’ కథ చెప్పారు. ‘అనగనగా ఓ పెద్ద పులి. అది అడవిలో ఉండేది. అడవిలోని జంతువులను అది మోసం చేసేది. అబద్ధాలు చెప్పేది. చాలా క్రూరంగా ప్రవర్తించేది. ప్రజలను, జంతువులను విపరీతంగా తినేది. ఎవరినీ లక్ష్య పెట్టకుండా తన స్వార్ధం కోసం, కడుపు నిండటం కోసం ఎవరినైనా తినేసేది. ఆ పులి చేస్తున్న అన్యాయాలను, మోసాలను, హత్యలను తట్టుకోలేక అక్కడున్న ప్రజలు దాన్ని అడవిలో నుంచి తరిమేశారు.

---------------------------------------------- రాష్ట్రీయం -------------------------------

వైఎస్‌ జగన్‌ చెప్పిన ‘పులి’ కథ
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలోని కలికిరి వద్ద నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ‘పెద్ద పులి’ కథ చెప్పారు. 

‘కొడుకు కోసం చంద్రబాబు క్షుద్రపూజలు’
 సీఎం చంద్రబాబు తప్పుకు మహిళా అధికారిణిని బలి చేశారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు.

సంక్రాంతికి 3,262 ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జంట నగరాల నుంచి వివిధ ప్రాంతాలకు 3,262 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్‌ యాదగిరి విలేకరుల సమావేశంలో తెలిపారు. 

గజల్‌ శ్రీనివాస్‌కు మరో షాక్‌
లైంగిక వేధింపుల కేసులో అరెస్టై జైలు ఊచలు లెక్కపెడుతున్న ప్రముఖ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌కు మరో షాక్‌ తగిలింది.

యాంకర్‌ ప్రదీప్‌ ఎక్కడ.. ఈ రోజు హాజరవుతాడా? లేదా?
న్యూఇయర్‌ సందర్భంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికిపోయిన ప్రముఖ యాంకర్‌ ప్రదీప్‌ మూడురోజులైనా పోలీసుల కౌన్సెలింగ్‌కు హాజరుకాలేదు.


-------------------------------------------- జాతీయం ------------------------------------

ఈ ఘర్షణలు మొట్టమొదటిసారి..
దళితుల ఆందోళనతో మహారాష్ట్ర దద్దరిల్లడానికి దారితీసిన ‘బీమా కోరేగావ్‌’ యుద్ధం స్మారక దినోత్సవానికి 200 ఏళ్లు.

సంచలన కేసు : లాలూకు శిక్ష ఖరారు వాయిదా
దావా కుంభకోణం కేసులో దోషిగా తేలిన బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ శిక్ష ఖరారు రేపటికి(గురువారానికి) వాయిదా పడింది.

'మోదీ బాబాలాగ ఉంటే కుదరదు'
 ప్రధాని నరేంద్రమోదీని కాంగ్రెస్‌ పార్టీ మరోసారి టార్గెట్‌ చేసింది. మహారాష్ట్రలో చోటు చేసుకున్న దళితులపై దాడి ఘటనపై మోదీ తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్‌ చేసింది.

'కేజ్రీవాల్‌.. నువ్వు చనిపోయినవాడితో పెట్టుకోవద్దు'
 ఒప్పందాలు పొసగనప్పుడు పార్టీలో కలిసి ముందుకు సాగడం సాధ్యం కాదని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత కుమార్‌ విశ్వాస్‌ అన్నారు.

------------------------------------------- అంతర్జాతీయం --------------------------------------------

ట్రంప్‌ దగ్గర లేదు.. కిమ్‌ వద్ద ఉంది..
ఉత్తరకొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ దగ్గర ఉన్నదాని కంటే అతి పెద్ద న్యూక్లియర్‌ బటన్‌ తన వద్ద ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ట్వీట్‌ ఒట్టిమాటలేనా?.

నాసా అంతరిక్ష గోధుమ పంట స్ఫూర్తితో..
 అంతరిక్షంలో గోధుమలు పండించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ చేపట్టిన ప్రయత్నాన్ని ఆదర్శంగా తీసుకుని ఆస్ట్రేలియన్‌ శాస్త్రవేత్తలు నూతన పద్ధతిని అభివృద్ధి చేశారు.

నా పేరు ఖాన్‌.. నేను ఉగ్రవాదిని కాదు!
ఒకప్పటి క్రికెటర్‌, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ బాలీవుడ్‌ను స్ఫూర్తిగా తీసుకొని చెప్పిన డైలాగ్‌ ఇది.

పాక్‌ గేమ్‌ ఇక చెల్లదు!
ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్‌ ఏళ్లుగా డబుల్‌ గేమ్‌ ఆడుతోందని, పాక్‌ తన వైఖరి మార్చుకోకపోవడం వల్లే..

------------------------------------------- సినిమా --------------------------------------------

బన్నీ తండ్రి పాత్రలో యాక్షన్ హీరో
సరైనోడు లాంటి సూపర్ హిట్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. 

మరో మెగా హీరోతో మెహరీన్
కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన మెహరీన్, కెరీర్ స్టార్టింగ్ లో కాస్త స్లోగా అనిపించినా..

సంక్రాంతికి ‘సాక్ష్యం’ ఫస్ట్‌ లుక్
జయ జానకీ నాయక సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో సాక్షం సినిమా చేస్తున్నాడు.

ఫిబ్రవరిలో మెగా వార్
టాలీవుడ్ లో సినిమాల నిర్మాణం భారీగా పెరుగతోంది. దీంతో హీరోల మధ్య పోటి తప్పటం లేదు.

------------------------------------------- క్రీడలు --------------------------------------------

మూడు సెంచరీలతో ప్రపంచ రికార్డు
 న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ కొలిన్‌ మున్రో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టి20ల్లో మూడు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు.

బౌన్సర్‌ తాకి విలవిల్లాడుతుంటే..
రంజీ ట్రోఫీ 2017-18 ఫైనల్‌ మ్యాచ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది.

పాండ్యా మన జట్టుకు ఒక ఆయుధం..!
ఇండియా-సౌతాఫ్రికాల మధ్య మొదటి టెస్టు జనవరి 5న కేప్‌టౌన్‌లో ప్రారంభకానున్న విషయం తెలిసిందే. 

హెల్మెట్‌ లేకుంటే ఈ బ్యాట్స్‌మన్‌ పరిస్థితేంటీ .!
 ఆస్ట్రేలియా క్రికెటర్‌ జాన్‌ హేస్టింగ్స్‌ తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు.

------------------------------------------- బిజినెస్‌ --------------------------------------------

ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప  నష్టాలతో ఫ్లాట్‌గా ముగిశాయి.

సానుకూల సంకేతాలు : లాభాల్లో మార్కెట్లు
అంతర్జాతీయంగా వస్తున్న సానుకూల సంకేతాలతో మార్కెట్లు, లాభాలతో ప్రారంభమయ్యాయి. 

డా.రెడ్డీస్‌కు మరో షాక్‌
దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కి మరోసారి  షాక్‌  తగిలింది.

త్వరలోనే దిగ్గజ బ్యాంకుల నుంచి న్యూఇయర్‌ గిఫ్ట్‌
స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా మాదిరి దిగ్గజ బ్యాంకులు ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు త్వరలోనే న్యూఇయర్‌ గిఫ్ట్‌ను ప్రకటించబోతున్నాయి.

Advertisement
Advertisement