Sakshi News home page

వాషింగ్టన్‌లో వైఎస్సార్‌సీపీ విజయోత్సవం

Published Tue, Jun 11 2019 8:18 PM

YSRCP Fans In Washington Celebrates Victory - Sakshi

వాషింగ్టన్ డిసి: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండమెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా అమెరికాలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు వర్జీనియా రాష్ట్రములోని చంటిలీ సిటీలో ఈస్ట్ గేట్ పార్క్‌లో తొలకరి జల్లుల మధ్యన విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 500మంది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు, ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలు ఎంతో ఉత్సహంగా పెద్దఎత్తున హాజరయ్యారు. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు, వైఎస్సార్‌సీపీ నాయకులకు, విజయ సారధి వైఎస్‌ జగన్‌కిశుభాకాంక్షలు తెలిపారు. వైఎస్‌ జగన్ నిర్వహించిన పాదయాత్ర వలన ప్రజల సమస్యలు పూర్తిగా తెలుసుకోవడమే కాకుండా, ఆయన చూపించిన పరిష్కార మార్గాలు, ప్రజలలో విశ్వాసం కలిగించిందని వైఎస్సార్‌ కంటే ఒక అడుగు ముందుకేసి పరిపాలిస్తారని ఎన్‌ఆర్‌ఐలు అభిప్రాయం వ్యక్తం చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఎంతో సంతోషానిచ్చిందని వైఎస్సార్‌సీపీ ఎన్నారై వింగ్‌ సభ్యులు అన్నారు. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లను గెలుచుకోవడం ప్రజావిజయమని పేర్కొన్నారు. ప్రజా నాయకుడు వైఎస్‌ జగన్‌కు పట్టంకట్టినందుకు ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రజారంజక పాలన అందించాలని ఆకాక్షించారు.

(ఏపీలో వైఎస్సార్‌సీపీ చరిత్రాత్మక విజయం)

మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగించే ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి కావడానికి, పది సంవత్సరాల నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న  కార్యకర్తలు ఎంతగానో కష్టపడ్డారని పలువురు వక్తలు ముక్త  కంఠంతో అన్నారు. జగన్‌మోహన్ రెడ్డి పేదల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన మహానేత డాక్టర్‌ వైఎస్సార్‌ అడుగుజాడల్లోనే నడుస్తారని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సమర్థవంతమైన నాయకుడిగా మంచి చేస్తారని ధీమా వ్యక్తంచేశారు. నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. జై జగన్‌.. జోహార్‌ వైఎస్సార్‌ నినాదాలతో హోరెత్తించారు. 

వాషింగ్టన్ డిసి మెట్రో వైఎస్సార్‌సీపీ కోర్ కమిటీ మెంబెర్స్ కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అతిథులందరికీ రుచకరమైనా ఆహారాన్ని అందించిన తత్వా రెస్టారెంట్ సుజీత్, వినీత్, బాబీ వారి బృందానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

What’s your opinion

Advertisement