Sakshi News home page

పెద్ద నేతల చిన్న లంచం నేరం కాదా?

Published Fri, May 15 2015 12:21 AM

పెద్ద నేతల చిన్న లంచం నేరం కాదా?

 (చట్టాలు ప్లస్ న్యాయశాస్త్రం ప్లస్ సాక్ష్యం కలిపి వడబోస్తే పదికోట్ల రూపాయల దాకా లంచాలు తీసుకుంటే పెద్ద నేరం కాదు అనే కొత్త సూత్రం వస్త్తుందేమో? అందరూ కలిసి లంచం విలువ పెంచడం దేశానికి మంచిది కాదు.)
 
 ‘‘న్యాయం గెలుస్తుందన్న మాట నిజమే కానీ గెలిచిం దంతా న్యాయం కాదు’’ అన్న శ్రీశ్రీ మాట అక్షరాలా న్యాయ మైన మాట. చిన్న ఉద్యోగి తీసుకున్న లంచం చాలా తక్కువని క్షమించడానికి వీల్ల్లే దనే సమన్యాయ సూత్రం...  ‘ముఖ్యమంత్రి గారి అక్రమా ర్జన రెండున్నర కోట్లేనా, వదిలేయండి’ అనడం  సమం జసమేనా? పెద్ద నేతలు చిన్న లంచాలు తీసుకోవచ్చనే కొత్త మినహాయింపేమైనా పుట్టుకొస్త్తున్నదా?
 చట్టపరమైన ఆదాయ వనరులకన్నా ఆస్త్తులెక్కు వగా ఉంటే నేరమని అవినీతి నిరోధక చట్టం చేసిన పార్లమెంటు ఎంత ఎక్కువుంటేనే నేరమో చెప్పలేదు. కొంత ఎక్కువ ఉన్నా ఫర్వాలేదనలేదు. ఏటా రూ. 12 లక్షలు సంపాదించే వ్యక్తి 12 లక్షల రూపాయల ఆస్తులు కూడబెడితే లంచాలే కారణం అనుకోవాలి. కాదని నిం దితులు రుజువు చేయలేకపోతే నేరమే. అక్రమాస్తులు 10 శాతం పైగా ఉంటేనే నేరస్త్తుడనాలని సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పు చెప్పింది. ఇదొక మార్గదర్శకం. శాస నం కాదు. ఏపీ ప్రభుత్వ మార్గదర్శకం ప్రకారం 20 శాతానికి మించితేనే ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఈ శాతాలకు చట్టపరమైన ప్రాతిపదిక ఏదీ లేదు. ఇప్ప టికీ డిఏ (ఆదాయానికి మించిన ఆస్తులు) కేసుల విష యంలో స్పష్టత లేదు. బంగారు లక్ష్మణ్ తీసుకున్న లక్ష రూపాయలూ లంచమే అంటూ ప్రాసిక్యూట్ చేశారు చనిపోయేదాకా. లక్ష అవినీతి నేరమే.. మరి రూ 2.83 కోట్ల ఆస్తులు ఎక్కువగా ఉంటే అవినీతి కాదా? ఈ ధర్మసూక్ష్మం అసమాన ప్రతిభావంతులైన న్యాయధను లకే కాదు, సామాన్యుడికీ అర్థం కాదు.  

 జయలలిత కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన నిర్దో షిత్వ తీర్పులోని కూడికల తప్పు వల్లనే ఆమె నిర్దోషి అయిందని కర్ణాటక ప్రాసిక్యూటర్ బి.వి. ఆచార్య ఘం టాపథంగా చెబుతున్నారు. జయ వ్యతిరేక రాజకీయ వర్గాలకు గొప్ప అవకాశం దొరికింది. చూడగానే చాలా స్పష్టమైన తప్పు బయటపడితే ఆ నిర్ణయాన్ని పునః పరిశీలన చేయాలన్నది న్యాయసూత్రం. హైకోర్టు తీర్పు ను సమీక్షించాలని హైకోర్ట్టునే కోరాలా లేక సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకోవాలా? అని తేల్చుకోవాలి.  లెక్కలు చేయడంలో న్యాయమూర్తి  సహాయకుల మీద ఆధారపడితే ఆ లెక్కను మళ్లీ పరిశీలించడం న్యాయం. ప్రాసిక్యూటర్ ఆచార్య వాదం రుజువైతే జయలలిత, మిత్రులతో సహా మళ్లీ నేరస్త్తురాలయ్యే అవకాశం ఉంది.

 అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(బి) ప్రకా రం సక్రమమైన ఆదాయ వనరులేమిటి? ఉన్న ఆస్తుల విలువేమిటి? అనే లెక్క మీదనే అవినీతి నేరం రుజువు ఆధారపడి ఉంది. నెత్త్తుటి నేరాలకు సాక్ష్యాలు కావాలి, ఆ సాక్ష్యాలను సరిగ్గా అంచనా వేయడమే న్యాయ నైపు ణ్యం. కాని ఆర్థిక నేరాలకు ఆస్త్తుల విలువలను సరిగ్గా లెక్కవేయడం రావాలి. వనరులతో ఆస్తుల విలువ సరిపోయిందో లేదో చూడడం రావాలి. అక్కడా న్యాయ నైపుణ్యం అవసరం. ఏదయినా సరే నిష్పాక్షికంగా, నిర్భయంగా చెప్పగలగడమే ధర్మం. అందుకే భయపక్ష పాతాలు లేకుండా పనిచేస్తానని ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణాలు అంటే ఇలా చేసే వాగ్దానాలని ఒక అర్థమైతే, విలువలని మరొక అర్థం. చట్టంలో నీతికి స్థానం లేదు, అవినీతి రుజువు కాదు.

 ఆదాయాలు ఆస్త్తుల మధ్య అప్పులు కూడా ఉం టాయి. అప్పులు లంచం కాదు. కనుక వాటిని కరా ఖండిగా లెక్కించాలి. డిఏ కేసులో జయకు, జయ కం పెనీలకు జాతీయ బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.10.67 కోట్లయితే, వాటిని రూ.24.17 కోట్లని కర్ణా టక హైకోర్టు లెక్కించడంలో తీవ్ర పొరబాటు జరి గిందా? తెలిసిన ఆదాయం రూ.5.99 కోట్లని ప్రాసి క్యూషన్ కూడా అంగీకరించింది. దానిని రూ.24.17 కోట్ల లోంచి తీసేస్తే ఆదాయం రూ.18.17 కోట్లని హైకోర్ట్టు తేల్చింది. ఆచార్య వాదన ప్రకారం తప్పు తొలగిస్తే ఆమె ఆదాయం రూ.4.68 కోట్లే. తేడా రూ.16.32గా లెక్కించవలసిన ఆస్తుల్ని రూ.2.83 కోట్లుగా లెక్కించారు. కాబట్టి హైకోర్టు లెక్క ప్రకారం ఆమె ఆస్తి 8.12 శాతం మాత్రమే ఎక్కువైంది. ఈ పొరబాటును తొలగిస్తే ఆదాయానికి మించిన ఆస్తులు 76.77 శాతం ఎక్కువ అవుతాయి. అప్పుడు జయ, ఆమె మిత్రులు నిర్దోషులనే వీలుండదు.  

 హైకోర్టు అప్పీలులో జయ వ్యతిరేక ప్రాసిక్యూషన్ న్యాయవాదిగా జి. భవానీ సింగ్‌ను  నియమించడం చెల్లదని సుప్రీంకోర్టు ఏప్రిల్ 27న తీర్పు చెప్పింది. ఆచా ర్యను కర్ణాటక ప్రాసిక్యూటర్‌గా నియమించింది. కాని అప్పటికే వాదాలు ముగిశాయి. కొత్త ప్రాసిక్యూటర్‌కు ఒక్కరోజే వాదించే అవకాశం దొరికింది. భవానీసింగ్ నియామకమే చెల్లనప్పుడు ఆయన వాదాన్ని ఎలా అనుమతిస్తారని సుప్రీం న్యాయమూర్తి ఒకరు అన్నారు. ఆచార్యకు మళ్లీ వివరంగా వాదించే అవకాశం దొరక లేదు. సుప్రీం తీర్పు ప్రకారం చెల్లని ప్రాసిక్యూటర్ వాదంపైన హైకోర్ట్టు ఆధారపడటం, సక్రమ ప్రాసిక్యూ టర్ ఆచార్య వాదాన్ని వినకపోవడం, తీవ్రమైన కూడిక పొరబాటు దొర్లడం, అందువల్ల దోషులు నిర్దోషులు కావడం సహజ న్యాయ సూత్రాలకు, సమన్యాయ శాస్త్రాలకు విరుద్ధం.

చిరుద్యోగుల అవినీతికి అరదండాలు సులువుగా పడతాయి, కోటలో రాణులు, రాజులు చేసే అక్రమార్జన కోట్లు దాటినా నిర్దోషులవుతారనే విమర్శకు ఎవరు సమాధానం ఇస్తారు? చట్టాలు ప్లస్ న్యాయశాస్త్రం ప్లస్ సాక్ష్యం కలిపి వడబోస్తే పదికోట్ల రూపాయల దాకా లంచాలు తీసుకుంటే పెద్ద నేరం కాదు అనే కొత్త సూత్రం వస్త్తుందేమో? అందరూ కలిసి లంచం విలువ పెంచడం దేశానికి మంచిది కాదు.
మాడభూషి శ్రీదర్

 

(వ్యాసకర్త మాడభూషి శ్రీదర్.. కేంద్ర సమాచార కమిషనర్)
 

Advertisement

What’s your opinion

Advertisement