గ్రహం అనుగ్రహం, శనివారం 6, జూన్ 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, శనివారం 6, జూన్ 2015

Published Sat, Jun 6 2015 4:40 AM

గ్రహం అనుగ్రహం, శనివారం 6, జూన్ 2015 - Sakshi

శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి బ.చవితి సా.5.24 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం ఉత్తరాషాఢ రా.6.48 వరకు, వర్జ్యం రా.10.38 నుంచి 12.11 వరకు, దుర్ముహూర్తం ఉ.5.27 నుంచి 7.44 వరకు
 అమృతఘడియలు ప.12.39 నుంచి 2.11 వరకు
 సూర్యోదయం    :    5.28
 సూర్యాస్తమయం    :    6.28
 రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
 యమగండం: ప.1.30 నుంచి 3.00 వరకు

 భవిష్యం
 
మేషం: పనుల్లో పురోగతి. ఇంటా బయటా అనుకూలంగా ఉంటుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. విందు వినోదాలు. ఆసక్తికరమైన సమాచారం అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ప్రోత్సాహం.
 
వృషభం: ముఖ్య నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.
 
మిథునం: దూర ప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు,  ఉద్యోగాల్లో మార్పులు.
 
కర్కాటకం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో గౌరవం లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు అందుతాయి.
 
సింహం: పనులు సకాలంలో పూర్తిచేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు.
 
కన్య: బంధువులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
 
తుల: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్య సమస్యలు చికాకు కలిగిస్తాయి. పనుల్లో జాప్యం జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు చిక్కులు.
 
వృశ్చికం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. పనులు చకచకా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది. ముఖ్య నిర్ణయాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
 
ధనుస్సు:  పనులు వాయిదా వేస్తారు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో చికాకులు.
 
మకరం: కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
 
కుంభం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కలసిరావు. ఉద్యోగులకు పని భారం. పనులలో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు.
 
మీనం:
నూతన ఉద్యోగాలలో చేరతారు. పనులలో పురోగతి సాధిస్తారు. కీలక నిర్ణయాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. వ్యాపారాలు అనుకూలిస్తాయి.
 - సింహంభట్ల సుబ్బారావు

Advertisement
Advertisement