తప్పులు సరిదిద్దుకుంటారా? | Sakshi
Sakshi News home page

తప్పులు సరిదిద్దుకుంటారా?

Published Wed, Aug 26 2015 1:28 AM

తప్పులు సరిదిద్దుకుంటారా? - Sakshi

ఆయనా, ఆయన ప్రభుత్వమూ పనిచేస్తున్న తీరును చూస్తే ఆయనకు ఆయనే సవాళ్లను సృష్టించుకుంటున్నట్టుంది. ప్రజలు తమ నిత్యజీవిత అనుభవం నుంచే పాలకులపై తీర్పు చెబుతారు. వీధిలోకి మంచి మరుగుదొడ్డి వస్తే గౌరవిస్తారు. మార్కెట్లో మామూలు వస్తువులే ఖరీదైనవైపోతే తప్పుబడతారు. ఓడ ఎంత పెద్దదైనా అడుగున పడ్డ చిన్న చిల్లు ముంచేస్తుంది.
 
 
 నరేంద్ర మోదీ గత ఏడాది జూలైలో ప్రభుత్వాన్ని ఏర్పర చినప్పటి నుంచి తీవ్ర సవాళ్లేవీ ఆయనకు ఎదురుకాలేదు. అదే నెలలో చమురు ధరలు పడిపోవడం మొద లు కావడం ఆయనకో వరమైంది. ద్రవ్యో ల్బణం దానికదే దిగివచ్చింది, ఏటా రెండులక్షల కోట్ల రూపా యల సబ్సిడీ భారం తగ్గింది. విజయం సాధించడానికి కావాల్సింది ‘అదృష్టవంతులైన సైనికాధిపతుల’ని నెపో లియన్ అన్నాడు. అదృష్టం ఇప్పుడు మోదీ వెంట ఉంది. ఆర్థిక వ్యవస్థ వికసించడం ప్రారంభమైంది. మనం భారీ ఎత్తున దిగుమతి చేసుకునే బొగ్గు తదితర ఖనిజాల అం తర్జాతీయ ధరలు తగ్గడమూ లాభించింది. గత ప్రభు త్వం వారసత్వంగా ఇచ్చిపోయిన సమస్యలు ఏమీ చేయ కుండానే మాయమయ్యాయి. మోదీ జరిపిన విదేశీ పర్య టనలు ప్రాముఖ్యతగలవి. ఆయన చేపట్టిన స్వచ్ఛ భార త్ వంటి కార్యక్రమాలు చాలా మంచివే, కానీ వాటిని ఆయన ఎంత చాకచక్యంగా అమలు చేయగలుగుతారనే ది కీలకమైనది.

నెహ్రూ, ఇందిరాగాంధీ, పీవీ నరసింహా రావు వంటి పూర్వ ప్రధానులు బలమైన రాజకీయ ప్రతి పక్షాన్ని ఎదుర్కొన్నారు. వామపక్షాల బలం క్షీణించిపో యిన స్థితిలోని ప్రతిపక్షమే నేడు మోదీకి ఉంది.  కాంగ్రె స్‌లో ఉన్నవారంతా లాయర్లు, వ్యాపారవేత్తలు, పార్ట్ టైం రాజకీయవేత్తలు, అధికార ప్రతినిధులే. దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్ వంటి వారంతా దాదాపు ప్రజాపునాది లేనివారే. కాబట్టి మోదీకి నిజమైన ప్రతిపక్షం లేదు. ఈ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చిన మాట నిజమే. గత ప్రభుత్వ పర్యావరణ శాఖ వద్ద నిలి చిపోయిన నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు అనుమతులను జారీ చేసింది. కాంగ్రెస్‌కు భిన్నంగా ఈ ప్రభుత్వం ఉపాధికల్పన, ఆర్థిక వ్యవస్థల గురించి మాట్లాడటమైనా చేస్తోంది. బీజేపీకి ధైర్యమూ, తెలివితేటలూగల అధ్యక్షుడు అమిత్‌షా కూడా ఉన్నారు. కానీ ప్రభుత్వం సక్రమంగా పనిచేయలేకపోతే అధ్యక్షు డు చేయగలిగేదేమీ ఉండదు. విమానాన్ని ఆటోమేటిక్ పైలట్ వ్యవస్థతో నడపొచ్చు. కానీ దేశానికి ఆటోపైలట్ వ్యవస్థ ఉండదు.

హఠాత్తుగా ఊహించని సవాళ్లు ఎదుర వుతాయి. మోదీకి ఇంకా అలాంటివి ఎదురుకాలేదు. కానీ ఆయనా, ఆయన ప్రభుత్వమూ పనిచేస్తున్న తీరు ను చూస్తే ఆయనకు ఆయనే సవాళ్లను సృష్టించుకుంటు న్నట్టుంది. ఆయన చాలా తెలివైన ప్రాంతీయ రాజకీయ వేత్త. మహాచురుకుకైనవాడేగానీ అంతర్జాతీయ రివాజు లు, పనిచేసే తీరుతెన్నులపై ఇంకా పట్టు సాధించలేదు. కొం దరు మినహా మోదీ మంత్రివ ర్గంలో ఉన్నవారంతా అనుభవం, పరిపాలనాదక్షత లేనివారు లేదా ప్రాపంచిక జ్ఞానం సైతం లేనివారు. సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కారీ, ప్రకాశ్ జవదేకర్‌ల వంటి విజయవంత మైన మంత్రులు కొందరున్నారు. అరుణ్‌జైట్లీ గొప్ప పార్లమెంటేరియనేగానీ చిదంబరం, ప్రణబ్‌ల వలే అ ధ్వానమైన ఆర్థికమంత్రి. మోదీ కనీసం పది మంది మం త్రులను తొలగించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రభుత్వం విఫలమౌతుంది. భూసేకరణ చట్టానికి సవరణ తేవా లని సలహా ఇచ్చిన మంత్రి ఎవరైనా తొలగించాల్సిందే.
 
 మోదీ, అమిత్‌షాలు ప్రతి పోరాటంలోనూ జోక్యం చేసుకుంటూ తమ ప్రతిష్టను కోల్పోతున్నారు. ఢిల్లీ ఎన్ని కల్లో అరవింద్ కేజ్రీవాల్‌దే గెలుపని అందరికీ తెలిసినా మోదీని ఆ పోరులోకి ఈడ్చి ఆయన ప్రతిష్టకు భంగం కలిగించారు. రేపు బిహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడినా అదే జరుగుతుంది. పీవీ ప్రధానిగా ఉండగా పలు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడింది. వాటికి దూరంగా ఉన్నారు కాబట్టే పీవీ ప్రతిష్టకు ఏ నష్టమూ వాటిల్లలేదు. జనాద రణ చాలా అస్థిరమైనది. తన స్థాయికి తగని పోరాటా లతో మోదీ ప్రతిష్టను కోల్పోతున్నారు.  పీవీ 225 మంది ఎంపీలతోనే ఐదేళ్లూ అధికారంలో ఉన్నారు. ప్రతిపక్షా లను ప్రసన్నం చేసుకోవడం ద్వారానే అది సాధ్యమైంది. పార్లమెంటులో పరిగణనలోకి వచ్చేవి అంకెలు కావు, ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తున్నామ నేదే. ఒబా మాతో అరగంట సమావేశానికే మోదీ ఆయన తనకు గొప్ప స్నేహితుడని అంటుంటారు. రోజూ కలుసుకునే ప్రతిపక్ష నాయకులతో స్నేహం చేయకపోతే ఎలా? చమురు ధరలు తగ్గుతున్నా ఆహార ధరలు ఎం దుకు పెరుగుతున్నాయని ప్రజలే కాదు, ఆర్‌బీఐ సైతం ప్రశ్నిస్తోంది. ఉల్లి ధరలు కిలో రూ.70కి చేరేవరకు వేచి చూసిన తర్వాత దిగుమతులేమిటి? ఒక నెల ముందే ఆ పని చేసి ఉండొచ్చు. చిన్నవిగా కనిపించే విషయాల్లోనే తప్పులు చేస్తున్నారు.
 
 లాయర్లకు మాట్లాడటమంటే మహా ఇష్టం. మోదీ ప్రభుత్వంలో అలాంటి వారు ఎక్కు వగా ఉండి, అతిగా మాట్లాడి నష్టం కలిగిస్తున్నారు. ఏ ప్రభుత్వానికైనా అనుకోని సమస్యలు ఎదురుకావడమే అతిపెద్ద సవాలు. వాటిని ఎదుర్కోగలగాలి. ప్రజలు తమ నిత్యజీవిత అనుభవం నుంచే ప్రభుత్వాలపై తీర్పు చెబుతారు. తమ వీధిలోకి ఒక మంచి మరుగుదొడ్డి వస్తే మోదీని గౌరవిస్తారు. మార్కెట్లోకి వెళ్తే చాలా మామూలు వస్తువులే ఖరీదైనవైపోతే మోదీని తప్పుబడతారు. ఓడ ఎంత పెద్దదైనా అడుగున పడ్డ చిన్న చిల్లు ముంచేస్తుం ది. చురుకైన రాజకీయవేత్త తప్పులను దిద్దుకుంటాడు. తప్పులను దిద్దుకోడానికి మోదీకి ఇంకా సమయం ఉం ది. కానీ ఆయన ఆ పని చే యగలరా?  

పెంటపాటి పుల్లారావు (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు)
e-mail:Drpullarao1948@gmail.com

Advertisement
Advertisement