యుద్ధోన్మాదుల శాంతి జపం | Sakshi
Sakshi News home page

యుద్ధోన్మాదుల శాంతి జపం

Published Sat, Aug 5 2017 12:57 AM

యుద్ధోన్మాదుల శాంతి జపం

జాతిహితం
చైనా మనతో నిజమైన యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ఇది 1962 కాదు కాబట్టి అది దానికి చాలా ఇబ్బందికరం అవుతుంది. అది నిజానికి మనతో బలవంతపు దౌత్యాన్ని సాగిస్తోంది. దాడికి, రెచ్చగొట్టడానికి అది తన సొంత మీడియానే సాధనంగా వాడుతోంది. ఆగ్రహావేశపూరితమైన మన చానళ్లు  చైనాపై స్టూడియో యుద్ధాన్ని ప్రారంభించాలని నా వాదన కాదు. వాస్తవానికి వారలా చేయకపోవడం వల్ల అంతా మంచే జరుగుతోంది. కాబట్టే పాకిస్తాన్‌ విషయంలో వలే  ప్రజాభిప్రాయం ఇంకా అదుపు తప్పిపోలేదు.

డోక్లామ్‌ వివాదంపై భారత మీడియా ఆచితూచి స్పందిస్తుండటం వల్ల అంతా మంచే జరుగుతుంది. కాకపోతే అది అలవాటులో పొరపాటు కాకుండా ఉండాలి. ముందుగా కాస్త దారితప్పి ఓ విషయాన్ని చెప్పనివ్వండి, ఎందుకైనా మంచిది దానితో పాటే క్షమాభిక్ష లేదా ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోనివ్వండి. నాకూ, నా కుటుంబానికి బతికున్న మరే జీవులకంటే పిల్లులు, కుక్కలంటేనే ఎక్కువ ప్రేమ. కాబట్టి అద్భుతమైన ఆ కుటుంబ సభ్యుల నుంచి మేం ఎన్నో జీవిత పాఠాలను నేర్చుకున్నాం. క్రికెట్‌ క్రీడ లాగే అవి కూడా నా రాజకీయ రచనలలోకి తొంగి చూస్తుంటాయి. డోక్లాం వివా దం మోదీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న మొట్టమొదటి నిజమైన వ్యూహాత్మక సంక్షోభం.  ఇంత సుదీర్ఘమైన ఉపోద్ఘాతమంతా, సిక్కిం సరిహద్దుల్లోని ఆ  పరిస్థితి పట్ల నా సొంత వృత్తిౖయెన వార్తా మీడియా వైఖరిని మా మొదటి మూడు కుక్కల తీరుతో పోల్చి చూపి... ఒక ముఖ్య విషయాన్ని చెప్పడానికే.

ఎనభైల మొదట్లో, మేం షిల్లాంగ్‌లో ఉండగా మా మూడు లాసా కుక్కలు మూడూ మిగతా ప్రపంచంతో సంబంధం లేనట్టుగా మా చిన్న తోటలో దర్పం ఒలకబోస్తూ బద్ధకంగా తిరుగుతుండేవి. ఎవరైనా మనిషి లేదా జంతువు ఆ దారంట పోతుంటే మహోగ్రంగా దాడికి దిగుతున్నట్టు నటిస్తూ మొరుగుతుండేవి. ఒక రోజున మా పొరుగున ఉండే ఆదివాసీ కుటుంబం వారి కోళ్లను ఆరు బయటకు వదిలింది. ఉండీ లేనట్టుండే మా గొలుసు కంచె దగ్గరకు  సహజమైన రంగురంగుల దుస్తులను ధరించిన రెండు కోడిపుంజులు వచ్చాయి.

విడ్డూరాల్లోకెల్లా విడ్డూరమనిపించేలా మా కుక్కలు అలవాటుగా ఆగ్రహంతో మొరగడానికి బదులు... ఆ పుంజుల పట్ల పూర్తి ఉదాసీనతను చూపాయి. వేరే వైపుకు చూడ్డం మొదలెట్టి, దారిన పొయ్యేవారిని చూసి మొరగడం ప్రారంభించాయి. అవి అంతకు ముందె న్నడూ అలాంటి ‘‘ముప్పు’’ ఎదుర్కోలేదు మరి. ఎందుకైనా మంచిదని జంకాయి. అది చూసిన మేం వాటిని ఎంతగా బుజ్జగించినా, రెచ్చగొట్టినా అవి మాత్రం ఆ కోడి పుంజులు లేనే లేవన్నట్టుగా వాటిని పట్టించుకోలేదు. చెడిపోయిన ఆ ఇంటి కుక్కలు చిన్నవే అయినా, వాటికి మనుగడను కాపా డుకోవాలనే స్పృహ మాత్రం బాగా ఉంది.

చైనా అంటే భయమా?
ఆ పాత కథ ఇప్పుడు ఎందుకో ముందే చెప్పాను. అయినా  తెలియదనేట్ట యితే లేదా తెలియనట్టు నటించేట్టయితే... మీరు భయం గొలిపే మన అతి దేశభక్తియుత కమాండో చానళ్లను గుర్తుకు తెచ్చుకోండి. ప్రతిరోజూ సాయంత్రం మూడు గంటలపాటూ అవి మన దేశానికి నిజమైన లేదా ఊహాత్మకమైన విదేశీ లేదా దేశీయ శత్రువులనందరినీ చీల్చి చెండాడటాన్నీ, ఆగ్రహంతో రంకెలువేస్తూ, ఊహకు అందే ప్రతి కాల్పనికమైన ముప్పు మీదకూ  మళ్లడాన్ని గుర్తుచేసుకోండి. డోక్లామ్‌లో చైనా చొరబాటు, కంచెకు అవతలి ఆ కోడిపుంజుల లాంటిదేనని అనుకుని ఆలోచించండి. మన యోధులు వారిని పట్టించుకోలేదనేది స్పష్టమే. కాకపోతే, తెలియని శత్రువు పట్ల భయంతో అవి అలా చేయలేదనేదే ఉన్న తేడా. దురాక్రమణ చేయగల శత్రువు ముంగిట ఉంటే అవి బెంబేలెత్తి పోయాయని అనడం పూర్తి అమర్యా దకరం. వాటికి అలా సూచించారు కాబట్టే అవి అలా ప్రవర్తిస్తున్నాయి.

దీనిని ముఖ్య వ్యూహాత్మక వాదనగా పరిగణించాలని కోరుతున్నా. చైనా వాళ్లు ఈ విడ్డూరాన్ని గమనిస్తున్నారు, దీని నుంచి వారు తమ సొంత నిర్ధార ణలను చేస్తున్నారు. చూడబోతే ఈ నిర్ధారణ తార్కికమైనదిగా తోస్తోంది: ప్రతి సాయంత్రం పాకిస్తాన్‌పై యుద్ధాన్ని ప్రకటించే భారత మీడి యాలోని అతి యుద్ధోన్మాద విభాగాలు చైనా నుంచి సవాలు అసలు లేనే లేదన్నట్టుగా నటిస్తున్నాయి. అంటే వారి ప్రభుత్వం వాటికి అలా చేయమని సలహా (ఆదేశం?) ఇచ్చి ఉండాలనేది స్పష్టం.

మన మీడియాకు చెడ్డపేరు
అదే జరిగితే, భారత ప్రభుత్వం చైనా అంటే భయపడుతోందనే అర్థానికి చేరుతాం. చిన్న శత్రువు పాకిస్తాన్‌ను నిరంతరం దునుమాడేయడం అంటే మహా మక్కువ చూపే అది, ఎక్కువ బలీయమైన శత్రువు దగ్గరికి వచ్చేసరికి దాక్కుంటుంది. తన నోటి దురుసుతనాన్ని అదుపులో ఉంచుకోవడమే కాదు, తదనుగుణంగా మీడియా కూడా నడుచుకోవడానికి హామీని కల్పిస్తుంది. చివరగా, మన మీడియాకే కాదు భారత జాతీయ ప్రయోజనానికి సైతం అత్యంత ప్రమాదకరంగా... తమలాగే భారత ప్రభుత్వం కూడా మీడియాను నియంత్రిస్తుందని చైనా భావిస్తుంది. అందువల్ల మన ప్రభుత్వం కూడా తన అంతరంగాన్ని బయటకు వెల్లడించాలన్నా లేక వెల్లడించరాదన్నా చైనా
లాగే ‘‘తన’’ మీడియా ద్వారానే చేస్తుందని నిర్ధారిస్తుంది. అలాగే భారత ప్రభుత్వం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, పాకిస్తాన్‌ సహా ఏ ఇతర శత్రువుతోనైనా ఘర్షణలను నిలిపి వేయమని మీడియాను ఆదేశించగలదని కూడా నిర్ధారిస్తుంది.

మన మీడియా పట్ల చైనాకు చిన్న చూపు ఏర్పడటం దీని చిన్న పర్యవసా నమే. కానీ ఈ కొత్త సవాలును చేపట్టే విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహ రించేంతగా లేదా ప్రజాభిప్రాయం మరింత ఆగ్రహావేశపూరితం కాకుండటం కోసం తమ వేట కుక్కలను తూర్పునకు చూడొద్దని చెప్పేంతగా  భారత్, చైనా అంటే భయపడుతోందని భావించవచ్చు. ఇది మనకు మరింత నష్టం కలిగించే నిర్ధారణ. ఈలోగా మన మీడియా యోధులు పాకిస్తాన్‌ను, మన సొంత కశ్మీరీలను, ముస్లింలను, చనిపోయినవారిని, భోఫోర్స్‌ కుంభ కోణంతో సంబంధం ఉందని ఆరోపించినవారిని మాటలతో దునుమాడే యడం కొనసాగుతూనే ఉంటుంది. ఈ చానళ్లలో ఒకటి డోక్లామ్‌ ప్రతిష్టం భనపై ఆగ్రహావేశాన్ని వ్యక్తం చేసేంత వరకు వచ్చింది. అయితే ప్రత్యేకించి దాన్ని లక్ష్యించడంతో అది సైతం దిగ్భ్రాంతికరంగా మౌనంగా మారిపో యింది. అది చైనాను ఉల్లాసరపచడమే కాదు, మరిన్ని కుహకాలకు దిగడానికి ప్రేరేపించేది కూడా.

చైనీయులు దీన్ని ఎలా చూసినాగానీ, ఇది వారు తప్పుడు అంచనాలకు రావడానికి, భారత్‌ పిరికిదనే ముందస్తు భావనకు రావడానికి దారి తీసే అవ కాశం ఉంది. భారత మీడియాలో ఆధిపత్యపూరితమైన, విజయవంతమైన విభాగాలు ఈ ముప్పును కూడా మిగతా వాటితో, ప్రత్యేకించి పాకిస్తాన్‌ ముప్పుతో సమానంగా లెక్కగడితే చైనా ఇలాంటి తప్పుడు అంచనాలకు రావడం జరగదు. కానీ అవి అలా చేయకపోవడం వల్ల, పాకిస్తాన్‌–కశ్మీర్‌– ముస్లింలను దునుమాడే కార్యక్రమాలకు అధికార పార్టీ అధికారిక ప్రతిని ధులు టీవీ స్టూడియోలకు తరచుగా వస్తుండటంవల్ల.. ప్రపంచ శక్తిగా పెంపొందు తున్న దేశానికి ఉండాల్సిన బుర్ర భారత్‌కు లేదని చైనా భావించవచ్చు.

మీరు చైనాను పైపైనే అయినా గమనిస్తుంటే, లేదా కాలేజీ రోజుల యవ్వనంలో మీరు మావో అంటే ఉత్తేజితులై ఉంటే మీకు ‘పోరాటం పోరాటం, మాటలు మాటలు’ అనే మావోయిస్టు సూత్రం తెలిసి ఉంటుంది. దశాబ్దాల తరబడి చైనీయులు విదేశీ వ్యవహారాలలో ఈ సూత్రాన్ని విజయ వంతంగా అమలు చేస్తున్నారు. తమ మాటలు, పోరాటంలో చాలా భాగాన్ని వారు తమ మీడియాగా చెప్పేదాన్లోనే చేస్తుంటారు. చైనా ఆర్థిక సంస్కరణ లను చేపట్టిన తర్వాత మూడు దశాబ్దాలకు కూడా వారి ప్రభుత్వం ఇంకా ఆ మూడు పత్రికల ద్వారానే మాట్లాడుతున్నదనడంలో ప్రపంచంలో ఎవరికీ సందేహం లేదు.

మన వైఖరి సమంజసం
ఇంకా పూర్తి ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్న వ్యవస్థలో అవే చైనా గురించి తెలుసుకోడానికి ఉన్న ఏకైక వనరుగా ఉంటున్నాయి. వెల్లడించడానికి ఉద్దే శించినది తప్ప మరే విషయమూ బయటివారికి ఎవరికీ అందే దారే లేదు. సరిగ్గా మన మీడియాలోని కొందరు పాకిస్తాన్‌పైన, మరింత దురదృష్టక రంగా తరచుగా మన సొంత ముస్లిం పౌరులపైన సైతం విరుచుకుపడే ధోర ణిలోనే... చైనా మీడియా ఇప్పుడు  భారత్‌పై దాడిని సాగిస్తోంది.

చైనా సూత్రంలోని పోరాటం–పోరాటం భాగాన్ని వారి అధికారిక మీడియా అమలు చేస్తోంది. మన మీడియాలో గణనీయమైన భాగం పూర్తి మౌనం వహిస్తుండగా, ప్రభుత్వం చైనా సూత్రంలోని మాటలు–మాటలు అనే భాగాన్ని ఆశావాదంతో పట్టుదలగా అమలు చేస్తోంది. పోరాడటమో లేదా ఉపసంహరించుకోవడమో తేల్చుకోమనేలా చైనీయులు మనకు సవాలు విసురుతున్నారు. మాటల్లోనైనా మనం దాన్ని తిప్పికొట్టకుండా, వాళ్లు మాట్లా డుతారని వేచి చూడటాన్ని కొనసాగిస్తున్నాం.

ఆగ్రహావేశపూరితమైన మన చానళ్లను చైనాపై స్టూడియో యుద్ధాన్ని ప్రారంభించమని భారత ప్రభుత్వం ఆదేశించాలని నా వాదన కాదు. వాస్తవా నికి వారలా చేయకపోవడం మంచి విషయం. కాబట్టే పాకిస్తాన్‌ విషయంలో వలే గాక ప్రజాభిప్రాయం ఇంకా అదుపు తప్పిపోలేదు. ప్రభుత్వం దౌత్య పరమైన పరిష్కారం కోసం దారి వెతకడం మంచి విషయమే. దౌత్యపరమైన ప్రయత్నాలకు ఉండే అవకాశాలను ప్రజాగ్రహం కుదించి వేయకుండా చూసు కోవడమూ మంచిదే. మనకు వ్యతిరేకంగా తెరచుకున్న కొత్త యుద్ధరంగం విషయంపై ప్రశాంత చిత్తంతో కూడిన ఇలాంటి దృక్ప«థం... మరో యుద్ధరం గంలో కూడా అలాంటి  విజ్ఞతనే కనబరిస్తే... మరింత విశ్వసనీయమైనదిగా కనిపిస్తుంది కూడా.

చైనీయులు నిజమైన యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ఇది 1962 కాదు కాబట్టి  క్షేత్ర స్థాయిలో అది వారికి చాలా ఇబ్బందికరం అవుతుంది. అది మొదటి తూటా పేల్చిన వెంటనే ఆస్ట్రేలియా నుంచి జపాన్‌ వరకు భారత్‌కు పశ్చిమానికి చూస్తాయి. ఉప అగ్రరాజ్యంగా ఉన్న చైనా కోరుకోని ఈ పరి ణామాన్ని హఠాత్తుగా కొని తెచ్చుకుంటుంది. చైనా మనతో బలవంతపు దౌత్యాన్ని సాగిస్తోంది. దాడికి, రెచ్చగొట్టడానికి అది తన సొంత మీడియానే సాధనంగా వాడుతోంది. ఆగ్రహావేశపరులైన మన తెల్ల మీసాలను ఉసిగొలిపి భయపెట్టడం అందుకు సమాధానం కాదనేది నిస్సందేహం. కాకపోతే, వారి ముప్పు పట్ల ప్రభుత్వ నిర్దేశితమైన ఈ పట్టింపులేనితనం వల్ల మనకు, డొక్లామ్‌ సమస్యకు పరస్పరం గౌరవప్రదమైన శాంతియుత పరిష్కారమనే లక్ష్యానికి నష్టదాయకమైన కొన్ని నిర్ధారణలను చైనా చేస్తుంది.

శేఖర్‌ గుప్తా
twitter@shekargupta

Advertisement
Advertisement