రంగుల రహస్యం వెల్లడించిన రామన్ | Sakshi
Sakshi News home page

రంగుల రహస్యం వెల్లడించిన రామన్

Published Fri, Nov 7 2014 1:12 AM

సీవీ రామన్

 ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో వెల్లడించి, నోబెల్ బహుమతి అందుకున్న మొట్టమొదటి భారతీయ శాస్త్రవేత్త  సీవీ రామన్ (నవంబర్ 7, 1888 -1970 నవంబర్ 21). తమిళనాడులోని తిరుచురాపల్లిలో చంద్రశేఖర్ వెంకటరామన్ జన్మించారు. తండ్రి విశాఖపట్నంలోని ఏవీఎన్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేయడం వల్ల రామన్ బాల్యం, విద్యాభ్యాసం విశాఖలోనే జరిగింది. అనంతరం మద్రాసులో పదార్థ విజ్ఞాన శాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు.

 కొన్ని పరిస్థితుల వల్ల ఆయన 1907లో ఫైనాన్స్ డిపార్టు మెంట్ ఉద్యోగిగా కలకత్తా వెళ్లాడు. అక్కడ డాక్టర్ మహేంద్ర లాల్ సర్కార్ స్థాపించిన ఇండియన్ అసోసియేషన్ ఫర్ సైన్స్ రామన్‌ను ఆకర్షించింది. ఉద్యోగం చేస్తూనే ఆ పరిశోధనాశాలలో  పరిశోధనలు ప్రారంభించారు. అనంతరం 1817లో ఆయన కలకత్తా విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర పీఠాధిపతిగా నియ మితులయ్యారు. ప్రకృతిని అమితంగా ప్రేమించే రామన్, అందులోని శబ్దాలు, రంగులు, విలువైన రాళ్లు, వజ్రాలు మొదలైన వాటి మీద పరిశోధన చేశారు. సముద్రం నీలిరంగులో ఎందుకు ఉంటుంది? ఆకాశం నీలి రంగులో ఉంటుంది కాబట్టి. సముద్ర జలంలోని అణువులు సూర్యకాంతిని వివిధ వర్ణాలుగా విడదీసి వెదజల్లుతాయి. వివిధ వర్ణాలు వివిధ దశలలో వెల్లివిరుస్తాయి. నీలిరంగు కిరణాలు మాత్రం ఎక్కువ లోతుకు చొచ్చుకుపోయి ప్రతిఫలిస్తాయి. అందువల్ల సముద్రం నీలి రంగులో ఉంటుందని రామన్ వివరించారు.  

 వీటిలో ఒక పరిశోధనా ఫలితానికే 1930లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. రామన్‌ను భారత ప్రభుత్వం ప్రథమ జాతీయ ఆచార్యునిగా నియమించింది. 1954లో ‘భార తరత్న’ బిరుదు ఇచ్చింది. 1957లో సోవియట్ యూనియన్ ‘లెనిన్ బహుమతి’తో  సత్కరించింది.  విదేశాలలో ఎన్నో అవకా శాలున్నా కాదని, మన దేశంలోనే అరకొర సదుపాయాలతోనే పరిశోధనలు చేసి విజయాలు సాధించారు.  
 (నవంబర్ 7 రామన్ జయంతి)
 ఎం.శోభన్ నాయక్,  ఎస్‌ఎఫ్‌ఐ రాష్ర్ట అధ్యక్షులు

Advertisement
Advertisement