మరింత సంక్షోభంలో ప్రపంచ పర్యావరణం | Sakshi
Sakshi News home page

మరింత సంక్షోభంలో ప్రపంచ పర్యావరణం

Published Thu, Jun 5 2014 12:15 AM

మరింత సంక్షోభంలో ప్రపంచ పర్యావరణం

నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

సెల్‌ఫోన్‌ల సవ్వడితో పిచ్చుకలు అంతరించి పోతున్నాయి. గద్దల సంఖ్య రాబందుల సంఖ్య కంటే త్వరి తంగా క్షీణిస్తోంది. పర్యావరణ విధ్వంసం కారణంగా పక్షు లూ, కీటకాలూ, వృక్షాలూ, జంతువులూ, సహచర జీవ వైవి ధ్యం పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.

ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న భూ తాపం భూగోళాన్ని నిప్పుల కొలిమిగా మార్చివేస్తోంది. మానవ మనుగడకే ముప్పు వాటిల్లే విపత్కర పరిణామాలు   పర్యావరణంలో నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో 21వ శతాబ్దం నడుస్తోంది.దైనందిన వ్యవహారాలలో కూడా ప్రతిక్షణం పర్యావరణాన్ని దృష్టిలో పెట్టు కొనవలసిన పరిస్థితులు  ఇప్పుడు నెల కొని ఉన్నాయి. పర్యావరణ కార్యాచరణ పిలుపును అనుసరించి ప్రతి ఏటా ఐక్యరాజ్యసమితి జూన్ 5 తేదీని మేలుకొలుపు దినంగా మాత్రం గుర్తు చేసుకొం టోంది. కానీ ఈ ఏటి నినాదం ప్రత్యేకమైనది. పెరిగిన సము ద్ర నీటిమట్టాలు చిన్న ద్వీపాల మీద, ఇతర ప్రాంతాల మీద విరుచుకు పడి సృష్టించే జల ప్రళయ నివారణను ఈ సంవ త్సర నినాదంగా ఐక్యరాజ్యసమితి స్వీకరించింది. 1972 నాటి అంతర్జాతీయ పర్యావరణ సదస్సు మొదలు, నాలుగు దశాబ్దాలుగా భూగోళాన్ని రక్షించుకోవలసిన అవసరం గు రించి ఐరాస ప్రపంచ ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంది. కర్బన కాలుష్య ఉద్గారాలను ప్రణాళికాబద్ధంగా క్షీణింప జేసే, ‘గ్రీన్ ఎకానమీ’ లక్ష్యానికి అన్ని దేశాలు కట్టుబడి భూమిని రక్షించుకోవాలని యు.ఎన్.ఇ.పి. హెచ్చరిస్తోంది.

పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్య ఉద్గారాలను విడుదల చేయాలంటూ 194 దేశాలు చేసుకున్న క్యొటో ప్రొ టోకాల్ ఒప్పందాన్ని అమెరికా వంటి సంపన్న దేశం కూడా ఆమోదించినా, అక్కడి ‘సెనేట్’ సమ్మతించలేదు. 2011 డి సెంబర్‌లో యు.ఎన్. క్లైమేట్ అంతర్జాతీయ సదస్సు క్యొటో ఒప్పందం పొడిగింపుతో ఆశలను చివురింప చేసింది. ‘నేచర్ క్లైమేట్ ఛేంజ్’ చేసిన ఇటీవలి అధ్యయనం ప్రకారం 12 దేశాలకు సంబంధించిన 1.3 బిలియన్ జనావళి తాగు, సాగు నీటి అవసరాలకు ఆధారపడిన ఇండస్, గంగ, బ్రహ్మ పుత్ర, సల్వీన్, మెకాంగ్ నదీ ప్రవాహాలూ, హిమాలయ సానువులలోని గ్లేసియర్స్ అతివృష్టి, వరద ఉద్ధృతి కార ణంగా పెను జల ప్రళయాలను సృష్టించనున్నాయి. 2050 నాటికి,  సమీప భవిష్యత్తులోనే ఈ పెను బీభత్సం ఆయా ప్రాంత జనావళి ఎదర్కోవలసి ఉంటుందని శాస్త్రవేత్తల అధ్యయన పత్రాలు హెచ్చరిస్తున్నాయి.

కార్బన్ కాలుష్య ఉద్గారాల విడుదల మిలియన్‌కు 400 పార్ట్స్ వంతున పెరగటం వలన ఈ సంవత్సరం ప్రపంచం న్యూ డేంజర్  జోన్‌లోకి అడుగు పెట్టిందని యునెటైడ్ నేషన్స్ క్లైమేట్ సంస్థ అధిపతి క్రిస్టియానా ఫిగ్‌లెస్ హెచ్చరిం చారు. పారిశ్రామిక విప్లవ ఆరంభానికి ముందుకార్బన్ డై ఆక్సైడ్ 280 పిపిఎమ్‌లు ఉండేది. గత అరవై సంవత్సరా లలో చమురు, బొగ్గు, గ్యాస్ వంటి ప్రకృతి వనరులను విచ్చ లవిడిగా మండించిన కారణంగా ఇప్పుడు కార్బన్ డై ఆక్సైడ్ ప్రపంచ మానవాళి మనుగడకు ప్రమాద హెచ్చరికలను జారీ చేయగల స్థాయికి చేరుకుంది. కార్బన్ ఉద్గారాలు ఈ విధంగా పెరిగినట్లయితే ఈ శతాబ్దం అంతానికే భూతాపం తో ప్రపంచం అట్టుడికిపోవలసి ఉంటుందని ఇంటర్ గవర్న మెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ హెచ్చరించింది.

 మన మహోన్నత హిమవత్పర్వత ప్రాంతాలలో గత 40 సంవత్సరాలలో కరిగిన 13 శాతం గ్లేసియర్స్(హిమ నదా లు) ఇప్పటికే పెను ప్రళయాలు సృష్టిస్తున్నాయి. ‘కరెంట్ సైన్స్’ ఇటీవల ఇచ్చిన నివేదిక దీనిని నిర్ధారిస్తున్నది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ 2007లో ఇచ్చిన వివరణ ప్రకారం 2035 నాటికి హిమాలయాలు ఎదుర్కొనే పెను ప్రమాదాన్ని ఊహాజనితమని కొందరు  కొట్టిపారే సినా, ఆ వివరణ పరిగణనలోనికి తీసుకోవలసినదేనని చార్‌ధామ్, కేదార్‌నాధ్‌లలో  2013 జూన్‌లో సంభవించిన జల ప్రళయం గుర్తు చేసిన మాట వాస్తవం.

సెల్‌ఫోన్‌ల నిరంతర సవ్వడితో పిచ్చుకలు అంతరించి పోతున్నాయి. గద్దల సంఖ్య రాబందుల సంఖ్య కంటే త్వరి తంగా క్షీణిస్తోంది. పర్యావరణ విధ్వంసం కారణంగా పక్షు లూ, కీటకాలూ, వృక్షాలూ, జంతువులూ, సహచర జీవ వైవి ధ్యం పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. మనిషి అవస రాలను తృప్తి పరిచే తీరులో వినియోగపడవలసిన ప్రకృతి వనరులను నాగరిక ప్రపంచం దురాశతో కొల్లగొడుతున్నది. జీవవైవిధ్యంతో సుజలాం, సుఫలాం, మలయజ శీతలంగా విలసిల్లవలసిన భారతావని ప్రకృతి వైపరీత్యాలతో విలవిల లాడుతోంది. భవిష్యత్తు తరాల వారికి వారసత్వంగా, రుణం తీర్చుకొనే విధంగా అందించవలసిన ప్రకృతి సంప దను నవ నాగరిక జీవన వ్యామోహంతో యథేచ్ఛగా కొల్లగొ ట్టడమంటే మన గొయ్యిను మనం తవ్వుకోవడమే.

(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)  జయసూర్య
 

Advertisement
Advertisement