పింఛన్లు ఎప్పుడు? | Sakshi
Sakshi News home page

పింఛన్లు ఎప్పుడు?

Published Wed, Aug 5 2015 12:38 AM

when will Pensions release for widows ?

వితంతువుల, వృద్ధుల ఆర్తనాదాలు, ఆకలి కేకలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినిపించ డం లేదు. రూ.1,000 పింఛన్ ఆశ చూపించి ఈ వర్గాల ఓట్లను దండుకుని ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. మంత్రి మండలి సమా వేశాలలో, జన్మభూమి బహిరంగ సభలలో లక్షలలో పింఛన్లు మంజూరు చేస్తున్నట్టు ఆయ న ప్రకటిస్తున్నారు. కొత్త పింఛన్లు ఈ నెల నుం చే అంటారు. కానీ ఎన్ని నెలలు గడిచిపోయినా ఈ పథకం అమలుకు నోచుకోవడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో అసలు ఈ ఊసే లేదు.

పాత పింఛన్లు రద్దుచేయడం, మళ్లీ వారి పేర్లనే చేర్చడం - గత కొద్దికాలంగా ఈ తంతుతోనే రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. యాభై లేదా అరవై పర్యాయాలు అధికారుల చుట్టూ తిరిగినా ఏమీ ప్రయోజనం ఉండడం లేదు. ఆచరణాత్మక వైఖరితో రూ.700 పింఛన్ ఇచ్చి ఆదుకుంటానని చెప్పిన జగన్‌ను ఎన్ను కోకుండా ప్రజలు తప్పటడుగు వేశారు.
 బారుట్ల మంగమ్మ  గుత్తి, అనంతపురం జిల్లా

Advertisement
Advertisement