కేసీఆర్‌ కుటుంబ సభ్యులే సీఎంలు: కోమటిరెడ్డి | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కుటుంబ సభ్యులే సీఎంలు: కోమటిరెడ్డి

Published Wed, Oct 3 2018 1:16 AM

Komati reddy venkata reddy commented over kcr  - Sakshi

తిప్పర్తి (నల్లగొండ): టీఆర్‌ఎస్‌ పార్టీలో ముఖ్యమంత్రులు అయ్యేది కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్, ఆ తర్వాత ఆయన మనుమడేనని, అదే కాంగ్రెస్‌ పార్టీలో అయితే ఎవరికైనా సీఎం అయ్యే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లో అందరూ సీఎంలేనని ఇటీవల ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కోమటిరెడ్డి స్పందించారు.

మంగళవారం నల్లగొండ జిల్లా తిప్పర్తిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్‌ పార్టీ సీఎంను రాహుల్‌ గాంధీ నిర్ణయిస్తారని తెలిపారు. మాయమాటలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లు కాంగ్రెస్‌ గెలుచుకోవడం ఖాయమని, తెలంగాణ ఉద్యమంలో ఈ జిల్లానే ముందుందన్నారు.

‘ముస్లిం రిజర్వేషన్‌ను మేనిఫెస్టోలో చేర్చండి’
సాక్షి, హైదరాబాద్‌: ముస్లిం రిజర్వేషన్‌ అంశాన్ని కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని టీఏ మేవా (తెలంగాణ ఆల్‌ మైనారిటీస్‌ ఎంప్లాయీస్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌) టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం గాంధీ భవ న్‌లో ఆయన్ను కలిసి వినతి పత్రం అందించింది.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని వాగ్దానం చేసి బిల్లు కేం ద్రానికి పంపి చేతులు దులుపుకుందని విమర్శిం చింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న బిల్లు పార్లమెంట్‌లో ఆమోదించే విధంగా చర్యలు చేపట్టాలని, ఉర్దూను రెండో ఐచ్ఛిక భాషగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. కార్యక్రమంలో టీఏమేవా అధ్యక్షుడు గులాం గజియొద్దీన్, షేక్‌ఫారుక్‌ హుస్సేన్, రశీద్, ఆరిఫ్, వహీద్, సుజావుద్దీన్, ఇస్మాయిల్, మసూద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement