Sakshi News home page

అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ లోకేశ్‌

Published Tue, Jun 5 2018 3:36 PM

Nara Lokesh Is Brand Ambassador For Corruption Says Mithun Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎయిర్‌ ఏషియా స్కాంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు రావడంతో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) తత్తరపాటుకు గురవుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ(వైఎస్సార్‌ సీపీ) ఎంపీ మిథున్‌ రెడ్డి అన్నారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్కాం విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు వైఎస్సార్‌ సీపీ ఎంపీలు రాజీనామాలను నిన్నా, మొన్నా చేసినట్లు టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడాతున్నరని మండిపడ్డారు. హోదా కోసం టీడీపీతో కలిసి పని చేస్తామని చెప్పినా పట్టించుకోలేదని, రాజీనామాలు దగ్గరకు వచ్చే సరికి టీడీపీ పారిపోయిందన్నారు. 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి ఉంటే కేంద్రం కచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చేదని పేర్కొన్నారు.

నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ మంత్రి నారా లోకేశ్‌ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతి గురించి మాట్లాడే అర్హత లోకేశ్‌కు లేదన్నారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికింది మీ నాన్న చంద్రబాబే అని తెలుసుకో లోకేశ్‌ అంటూ మిథున్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. రాజీనామాల ఆమోదం అనంతరం ఎన్నికలకు వెళ్లి ప్రజాతీర్పును కోరతామని చెప్పారు.

Advertisement

What’s your opinion

Advertisement