రెండో తరగతి ప్రజలుగా జీవిస్తున్నాం | Sakshi
Sakshi News home page

రెండో తరగతి ప్రజలుగా జీవిస్తున్నాం

Published Mon, Feb 5 2018 7:01 AM

people sharing their sorrows to ys jagan - Sakshi

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): తమిళనాడు రాష్ట్రానికి బతుకుదెరువు కోసం వెళ్లి అక్కడే దశాబ్దాలుగా స్థిరపడిన తెలుగువారందరం రెండో తరగతి ప్రజలుగా జీవనం కొనసాగిస్తున్నామని వైఎస్సా ర్‌ సేవాదళ్‌ తమిళనాడు విభాగం అధికార ప్రతినిధి కమలాపురం లక్ష్మీ శ్రీదేవిరెడ్డి పేర్కొన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ములుముడి గ్రామంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనకు సంఘీభావంగా వైఎస్సార్‌ సేవా దళ్‌ తమిళనాడు విభాగం సభ్యులు పా ల్గొని పాదయాత్ర చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు  ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. అప్పుడు లక్షలాదిగా ఉన్న తాము తమిళనాడులో ఉండాల్సిన పనిలేదని, సొంత రాష్ట్రానికి వచ్చి ఉపాధి పొందగలమన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తారనే నమ్మకముందని తెలిపా రు. అందువల్లే తాము తమిళనాడు నుంచి వచ్చి ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొంటున్నామన్నారు. ఈ యాత్రలో సేవాదళ్‌ సంయుక్త కార్యదర్శి రవీంద్రనా«థ్‌రెడ్డి, సంపత్‌కుమార్, మధుసూదన్, వజ్రమ్మ, వెంకటేశ్వరరావు, సునీల్, కొండలరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement