టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం

28 May, 2020 16:40 IST|Sakshi

సాక్షి, విజ‌య‌వాడ‌: టీడీపీ నేతలు మ‌హానాడు వేదిక‌గా మాటల యుద్దానికి దిగారు. చంద్రబాబు ముందే టీడీపీ నేతలు చిన‌రాజ‌ప్ప‌, జ్యోతుల నెహ్రూ ఒకరినొకరు విమర్శించున్నారు. ఈ క్రమంలో చిన‌రాజ‌ప్ప‌  మాట్లాడుతూ.. కొంత మంది నేత‌లు అధికారం పోగానే పార్టీని వీడిపోయారని అన్నారు. తిరిగి వెళ్లిపోయిన వారిని పార్టీలోకి తీసుకోమని తెలిపారు. మాజీ మంత్ర‌లు, ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారని చె​ప్పారు. ప్ర‌భుత్వం అధికారంలో లేకుంటే పార్టీని ప‌ట్టించుకోరా అని ప్రశ్నించారు. ఎవ‌రు ఏ విధంగా వ్వ‌వ‌హారిస్తున్నారో చంద్ర‌బాబు గ‌మ‌నించాలని చినరాజప్ప అన్నారు. (‘రెండు కుటుంబాల గొడవను రాజకీయం చేస్తున్నారు’)

చిన‌రాజ‌ప్ప వ్యాఖ్య‌ల‌ను టీడీపీ నేత జ్యోతులు నెహ్రూ తీవ్రంగా విబేధించారు. మైకులు ప‌ట్టుకొని మాట్లాడితే స‌రిపోదని విమర్శించారు. ముందు పార్టీ కేడర్‌కు న‌మ్మ‌కం క‌లిగించాలన్నారు. నాయ‌కుని చుట్టు ప్ర‌ద‌క్ష‌ణ చేస్తే నాయ‌క‌త్వం రాదని ఎద్దేవా చేశారు. పార్టీ కేడ‌ర్ చూట్టు ప్ర‌ద‌క్ష‌ణలు చేయాలన్నారు. చిన‌రాజ‌ప్ప మ‌రింత బాద్య‌త‌గా వ్య‌వ‌హరించాలన్నారు. ప‌దవులు రావ‌డమ‌నేది అదృష్టం మీద ఆధార‌ప‌డి ఉంటుందని తెలిపారు. తూర్పు గోదావ‌రి జిల్లా అధ్య‌క్షుడు ఎవ‌రో కూడా తెలియ‌ని ప‌రిస్థితిలో ఉన్నామన్నారు. జిల్లాలో తనకు తెలియ‌కుండానే పలు కార్యాక్ర‌మాలు నిర్వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. జిల్లాకు రాష్ట్ర క‌మిటీ నాయ‌కులు వ‌స్తే క‌నీసం స‌మాచారం ఇవ్వ‌డం లేదని జ్యోతుల నెహ్రూ అన్నారు. (నిబంధనలు గాలికొదిలేసిన టీడీపీ నేతలు)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా