నిప్పు నాయుడికి ఆ హక్కు లేదు : విజయసాయి రెడ్డి | Sakshi
Sakshi News home page

‘నిప్పు నాయుడికి ఆ హక్కు లేదు’

Published Wed, Jun 13 2018 3:55 PM

Vijayasai Reddy Challenged Chandrababu Naidu Again Asks To Probe On TTD Corruption - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తనకు నోటీసులు పంపించందంటూ వస్తున్న మీడియా కథనాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వీ విజయసాయి రెడ్డి బుధవారం స్పందించారు. తనకు టీటీడీ నుంచి ఇంతవరకూ ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. తనకు ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదని, అందులో ఏం ఉందో తెలియదని పేర్కొన్నారు. 4 సంవత్సరాలు టీడీడీ బోర్డులో సభ్యుడిగా తాను పని చేసిన విషయాన్ని ఈ సందర్భంగా విజయసాయి గుర్తు చేశారు.

తనకు తెలిసినంత వరకూ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ చట్టం కిందకు టీటీడీ వస్తుందని అందులో ఒక స్పెషల్ చాప్టర్ ప్రకారం టీటీడీకి నోటీసులు ఇచ్చే అధికారం లేదని అన్నారు. ఒకవేళ ఇస్తే అవి నోటీసులుగా పరిగణలోకి తీసుకోలేమని తేల్చిచెప్పారు. కావాల్సిన సమాచారం కోసం వ్యక్తిని అభ్యర్థించగల హక్కు మాత్రమే టీటీడీకి ఉంటుందని తెలిపారు.

‘టీటీడీ సొమ్మును ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దోపిడీ చేశాడు. దోచుకున్నాడు. తవ్వుకొనిపోయాడు. ఆయన కొడుకు ఈ సొమ్మును విదేశాలకు తరలించాడు. ఇదే నా ప్రధాన ఆరోపణ. నా ఆరోపణకు సోర్స్‌ ఏదని ప్రశ్నించే అధికారం మీకు లేదు. ఎప్పుడూ నిప్పు అని చెప్పుకునే నిప్పు నాయుడు, పప్పు నాయుడిలపై సీబీఐ విచారణ జరగాలి. విచారణలో మీరు నిర్ధోషులని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటా.

సీఎం, మంత్రి హోదాల్లో ఉన్న మీరు, మీ తనయుడు స్వయంగా సీబీఐ విచారణకు సిద్ధపడాలి. అధికారంలో ఉన్నామని మీరు చేసే తాటాకు చప్పుళ్లుకు మేం భయపడం. ఆరోపణలపై స్పందించాలని 13 గంటలు గడువు ఇస్తే 240 గంటల తర్వాత టీటీడీ ద్వారా స్పందిస్తారా?. అంతా చక్కదిద్దుకుని టీటీడీ నుంచి నోటీసులు ఇప్పిస్తారా?. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మీ అవినీతి లెక్కలను వైఎస్సార్‌ సీపీ తేల్చుతుంది.

నేను చెప్పినప్పుడే హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంట్లో సీబీఐ సోదాలు జరిగివుంటే నేల మాళిగల్లో దాచిన అవినీతి సొమ్ము బయటపడేది. మీ నాలుగేళ్ల అవినీతి పాలనను ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారే తగిన బుద్ధి చెబుతారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, ఎలాంటి తప్పు చేయకుంటే సీబీఐ విచారణకు సిద్ధం కావాలి. సెక్షన్‌ 160 ప్రకారం నోటీసులు పంపితే చట్టబద్దంగా సమాధానం ఇస్తాను.

నాకు నోటీసులు ఇచ్చే హక్కు నిప్పు నాయుడు, పప్పు నాయుడు, టీటీడీలకు లేవు. ఈవీఎం టాంపరింగ్ పై ఈరోజు కాదు ఏప్పటినుంచో అన్ని పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అధికారం అనుభవించి ఇవాళ మాట్లాడటం చంద్రబాబు భయానికి నిదర్శనం.’ అని విజయసాయి సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

విజయసాయి విచారణకు డిమాండ్‌ చేసిన 14 అంశాలు :
1. పోలవరం, పట్టిసీమ, పురుషోత్తం పట్నం ప్రాజెక్టుల్లో జరిగిన అవకతవకలు
2. ప్రకటనకు ముందే రాజధాని భూములను బినామీలతో కొనిపించటం
3. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల్లో అవినీతి
4. అమరావతి భూ కుంభకోణం
5. బాబు విదేశీ పర్యటనలు, బాబు కుమారుడి విదేశీ పర్యటనలు, బాబు కుటుంబం విదేశీ పర్యటనలు
6. కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌
7. ఓటుకు కోట్లు కేసు
8. ఐఎంజీ భారత్‌ స్కాం
9. అగ్రిగోల్డ్‌ స్కాం
10. బాబు కుటుంబ ఆస్తులు, హెరిటేజ్‌ ఆస్తులు, లోకేశ్‌ బాబు సంపాదన
11. తిరుమలలో అరాచకాలు
12. సింగపూర్‌ కంపెనీలకు రాజధాని భూముల అప్పగింత
13. నీరు చెట్టు పథకంలో అవినీతి
14. భూ సేకరణలో అరాచకాలు

Advertisement
Advertisement